భారత్ కరోనా అప్‌డేట్.. పెరిగిన కేసులు
India corona bulletin on October 14th.నిన్నటితో పోలిస్తే నేడు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన
By తోట వంశీ కుమార్ Published on 14 Oct 2021 5:05 AM GMT
నిన్నటితో పోలిస్తే నేడు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 13,01,083 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 18,987 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,40,20,730కి చేరింది. నిన్న ఒక్క రోజే 246 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,51,435 కి చేరింది. నిన్న 19,808 మంది కోలుకున్నారు.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) October 14, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/dXSRYdeQwR pic.twitter.com/QWfakVd3uZ
ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,40,20,730 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,06,586 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 215 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ రికవరీ రేటు 98.07 శాతానికి చేరింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 35.66లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 96,82,20,997 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.