దేశంలో కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఒక్కసారిగా 14వేలకు దిగొచ్చాయి. గడిచిన 24 గంటల్లో 11,81,766 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 14,313 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,39,85,920కి చేరింది. నిన్న ఒక్క రోజే 181 మంది మరణించారు.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,50,963 కి చేరింది. నిన్న 26,579 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,33,20,057 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,14,900 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 212 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ రికవరీ రేటు 98.04 శాతానికి చేరింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 65,86,092 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 95,89,78,049 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.