భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 11,50,538 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 9,119 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,45,44,882కి చేరింది. నిన్న ఒక్క రోజే 396 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,66,980కి చేరింది.
నిన్న 10,264 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,39,67,962కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,09,940 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.33 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 98,13,039 మందికి కరోనా వ్యాక్సిన్ను వేశారు. ఇప్పటి వరకు 1,19,38,44,741 పైగా డోసుల వ్యాక్సిన్ను పంపిణీ చేశారు.