భారత్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 11,07,617 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 8,865 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 287 రోజుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,44,56,401కి చేరింది. నిన్న ఒక్క రోజే 197మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,63,852కి చేరింది.
నిన్న 11,971 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,38,61,756కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,30,793 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.27 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 59,75,469 మందికి కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్పటి వరకు 1,12,97,84,045 పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.