భారత్ కరోనా అప్‌డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే..?
India corona bulletin on August 29th.భారత్‌లో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 17,55,327
By తోట వంశీ కుమార్ Published on 29 Aug 2021 4:36 AM GMT
భారత్‌లో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 17,55,327 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 45,083 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కి చేరింది. నిన్న ఒక్క రోజే 460 మంది మృతి చెందారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,37,830కి చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) August 29, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/P7RaHXos5x pic.twitter.com/QZ2np28A4F
24 గంటల వ్యవధిలో 35,840 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,18,88,642కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,68,558 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.53శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.28శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.57 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 73.8 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 63.09 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.