భారత్ కరోనా అప్‌డేట్.. కేరళలో కొనసాగుతున్న విజృంభణ
India corona bulletin on august 27th.దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 44,658 పాజిటివ్ కేసులు నమోదు
By తోట వంశీ కుమార్ Published on
27 Aug 2021 4:26 AM GMT

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 44,658 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 44 వేలకు పైగా నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా కేరళలోనే 30వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా నిన్న 496 మంది ప్రాణాలు కోల్పోగా.. కేరళలో 162 మంది మృత్యువాత పడ్డారు. కాగా..దేశంలో ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,36,861కి చేరింది.
నిన్న32,988 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,18,21,428కి చేరింది. దేశంలో ప్రస్తుతం 3,44,899 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.60శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.10 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 61 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.
Next Story