ఫేస్‌బుక్ ఇండియాలో మత విద్వేషాన్ని రెచ్చగొడుతోందని ఆరోపిస్తూ మార్క్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాసిన ఇండియా కూట‌మి

సోషల్ మీడియా సంస్థ భారతదేశంలో సామాజిక అశాంతిని ప్రోత్సహిస్తోందని, మత విద్వేషాలను రెచ్చగొడుతోందని

By Bhavana Sharma  Published on  12 Oct 2023 5:45 PM GMT
ఫేస్‌బుక్ ఇండియాలో మత విద్వేషాన్ని రెచ్చగొడుతోందని ఆరోపిస్తూ మార్క్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాసిన ఇండియా కూట‌మి

సోషల్ మీడియా సంస్థ భారతదేశంలో సామాజిక అశాంతిని ప్రోత్సహిస్తోందని, మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపిస్తూ భారత కూటమి ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాసింది.

మెటా చీఫ్‌ను ఉద్దేశించి పంపిన లేఖ లో ఏముంది అంటే.."మేము భారతదేశంలోని 28 రాజకీయ పార్టీల కూటమి అయిన ఇండియా నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (INDIA) తరపున వ్రాస్తున్నాము. మేము ఉమ్మడి ప్రతిపక్ష కూటమికి ప్రాతినిధ్యం వహిస్తాము‌ అలానే 11 రాష్ట్రాలలో పాలక కూటమి, ఓక భారతీయ ఓటర్లలో దాదాపు సగం మందికి పైగా ప్రాతినిధ్యం వహిస్తాము‌. అధికార BJP యొక్క మత విద్వేష ప్రచారానికి సహాయం చేయడంలో వాట్సాప్ అలానే ఫేస్ బుక్ పాత్ర గురించి వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రిక ఇటీవల బహిర్గతం చేసిన విషయాలు మీకు తెలిసి ఉండవచ్చు.

ప్రత్యేకించి, బీజేపీ సభ్యులు, మద్దతుదారులచే వాట్సాప్ గ్రూపులను ఉపయోగించి ఈ నీచమైన, మత విభజన ప్రచారం ఎలా జరుగుతుందనే వివరాలను వారు ఆ ఆర్థికల్లో వివరించారు. అలానే 'అందర్ ఇండియాస్ ప్రెజర్, ఫేస్‌బుక్ లెట్ ప్రాపగంధ అండ్ హెట్ స్పీచ్ ట్రైవ్' అనే శీర్షికతో మరొక కథనంలో, పాలక వ్యవస్థ పట్ల ఫేస్‌బుక్ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ల కఠోర పక్షపాతాన్ని సాక్ష్యాధారాలతో తెలియజేశారు. ఇది చాలా కాలంగా ప్రతిపక్షంలో ఉన్న మాకు బాగా తెలుసు. గతంలో కూడా చాలా సార్లు మేము ఇదే విషయం గురించి చర్చించాము.

వాషింగ్టన్ పోస్ట్ చేసిన ఈ సమగ్ర పరిశోధనల ద్వారా భారతదేశంలో సామాజిక అశాంతికి, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి మెటా దోషి అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా, అధికార పార్టీ కంటెంట్‌ను ప్రమోట్ చేస్తూనే మీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రతిపక్ష నాయకుల కంటెంట్‌ను అల్గారిథమిక్ నియంత్రణ, అణచివేతను చూపే డేటా కూడా మా వద్ద ఉంది. మీరు రూలింగ్ పార్టీ కంటెంట్ ని సపోర్ట్ చేస్తా ఇతర పార్టీల కంటెంట్ ను తీసేస్తున్నారు.

ఒక ప్రైవేట్ విదేశీ కంపెనీ ఒక రాజకీయ నిర్మాణం పట్ల ఇటువంటి కఠోరమైన పక్షపాతం వహించడం అనేది డెమోక్రసీకి దెబ్బ. భారత కూటమిలోని మేము దానిని తేలికగా తీసుకోము. 2024లో జరగనున్న జాతీయ ఎన్నికల దృష్ట్యా, ఈ వాస్తవాలను తీవ్రంగా పరిగణించి, భారతదేశంలో మెటా కార్యకలాపాలు తటస్థంగా ఉండేలా చూడాలని, సామాజిక అశాంతిని కలిగించడానికి లేదా భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన వాటిని వక్రీకరించడానికి తెలివిగా లేదా తెలియకుండా ఉపయోగించకుండా తక్షణమే నిర్ధారించాలని మీకు మా అత్యవసర విజ్ఞప్తి" అని రాసుకొచ్చారు. ఇండియా కూట‌మి గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచ‌య్‌కు కూడా రాసింది

మరి దీనిపై మెటా, గూగుల్ ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

Next Story