'నేను గర్భవతిని, ఆందోళన చెందాను'.. ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ క్షమాపణలు
బెంగళూరులో ఒక ఆటోరిక్షా డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ అతనికి క్షమాపణలు చెప్పింది. ఆదివారం అనేక మంది సాక్షుల ముందు ఆమె క్షమాపణ చెప్పింది.
By అంజి
'నేను గర్భవతిని, ఆందోళన చెందాను'.. ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ క్షమాపణలు
బెంగళూరులో ఒక ఆటోరిక్షా డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ అతనికి క్షమాపణలు చెప్పింది. ఆదివారం అనేక మంది సాక్షుల ముందు ఆమె క్షమాపణ చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. "ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదు. నన్ను క్షమించండి. నేను గర్భవతిని. గర్భస్రావం అవుతుందనే భయంతో, నేను అలా మాట్లాడాను. నాకు బెంగళూరు అంటే చాలా ఇష్టం. మాకు కన్నడ అంటే చాలా ఇష్టం. మాకు కన్నడిగులు అంటే చాలా ఇష్టం. మాకు బెంగళూరు, దాని సంస్కృతి అంటే చాలా ఇష్టం," అని పశ్చాత్తాపం చెందిన ఆ మహిళ చేతులు జోడించి తన చర్యలను వివరిస్తూ చెప్పింది.
"కన్నడిగులందరూ మమ్మల్ని క్షమించాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఆటో డ్రైవర్ల పట్ల మాకు గౌరవం ఉంది. మేము బెంగళూరును ప్రేమిస్తున్నాము. ఇక్కడి వాతావరణాన్ని మేము ప్రేమిస్తున్నాము" అని ఆమె అన్నారు. ఆ మహిళ తన భర్తతో పాటు కన్నడలో క్షమాపణ చెప్పవలసి వచ్చింది, ప్రేక్షకులు ఆమెకు కన్నడ భాషలో శిక్షణ ఇచ్చారు.
శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆగ్నేయ బెంగళూరులోని బెల్లందూర్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆ మహిళ ఆటోరిక్షా డ్రైవర్‌పై దాడి చేసింది. ఆటోరిక్షా డ్రైవర్ లోకేష్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. అనుకోకుండా ఆ యువతీ స్కూటీకి ఆటో.. తాకడంతో యువతి కింద పడింది. అయితే.. సడన్ గా జరిగిన ఈ ప్రమాదం నేపథ్యంలో బాధిత యువతి ఆటో డ్రైవర్ లోకేష్‌పై అరవడం, మాటలతో దుర్భాషలాడడం ప్రారంభించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ సంఘటనను అతను తన ఫోన్లో రికార్డ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె తన చెప్పు తీసి అతనిని కొట్టింది. వీడియో తీయడం కొనసాగించమని సవాల్ చేస్తూనే ఆమె అతన్ని కొట్టడం కొనసాగించింది.