ఐసీఎస్ఈ, ఐఎస్ఈ పది, 12వ తరగతి ఫలితాలు వాయిదా పడ్డాయి. నేడు విడుదల కావాల్సిన ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని భారత పాఠశాల విద్య ధ్రువీకరణ మండలి వెల్లడించింది. ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఐసీఎస్ఈ) 10వ తరగతి, ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్(ఐఎస్ఈ) 12వ తరగతి పరీక్ష ఫలితాలను శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్ష ఫలితాలను cisce.org లేదా results.cisce.org అనే వెబ్ సైట్లలో చూసుకోవచ్చునని వెల్లడించింది.
ఫలితాలు, వారికి వచ్చిన మార్కులకు సంబంధించి విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని వివరిస్తూ వారి పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఆగస్టు 1 వరకు సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది. పాఠశాలలు కూడా విద్యార్థుల ఫలితాల కోసం ఐసీఎస్ఈ పోర్టలోని careers విభాగం నుంచి పొందవచ్చునని సీఐఎస్‌సీఈ కార్యదర్శి జెర్నీ అరాథూన్ చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా ఐసీఎస్ఈ పదోతరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.