విడాకులకు కోసం దరఖాస్తు చేసుకున్న ఐఏఎస్ టాపర్లు
IAS Topper Couple file for Divorce .. ప్రేమ వివాహం చేసుకున్న సివిల్ టాపర్స్ జంట మరోసారి వార్తల్లోకి వచ్చింది.
By సుభాష్ Published on 21 Nov 2020 3:46 PM GMT
ప్రేమ వివాహం చేసుకున్న సివిల్ టాపర్స్ జంట మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రేమ వివాహం చేసుకున్న ఐఎఎస్ దంపతులు టీనా డాబీ, అథర్ అమీర్‌లు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. 2015 సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో టీనా డాబీ టాపర్, అదే ఏడాది అథర్ అమీర్ ఖాన్ ఆలిండియా సెకండ్ ర్యాంక్ సాధించారు. అథర్ అమీర్ ఖాన్ జమ్మూకశ్మీర్ కు చెందిన వారు. వీరిద్దరూ రాజస్థాన్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారులు. ఐఏఎస్ శిక్షణ సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, అది క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు.
తాము కలిసి జీవించలేమని, అందువల్ల తమకు విడాకులు మంజూరు చేయాలని టీనాడాబీ, అథర్ అమీర్ ఖాన్ లు జైపూర్ లోని ఫ్యామిలీ కోర్టు-1లో వీరిద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. టీనా డాబీ సోషల్ మీడియా ఖాతాలో తన పేరులోని ఖాన్ ను తొలగించారు. అనంతరం అథర్ ఖాన్ కూడా తన ఇన్ స్టాగ్రాం నుంచి టీనా ఖాతాను అన్ ఫాలో చేశారు. గతంలో వీరిద్దరి ప్రేమ వివాహాన్ని లవ్ జిహాద్ గా హిందూ మహాసభ పేర్కొంది. టీనా ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా, అమీర్ అథర్ ఈజీఎస్ సీఈవోగా పనిచేస్తున్నారు