లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన ఐఏఎస్ అభ్యర్థులు.. చివరికి..

లక్నోలోని గోమతి నగర్‌లో ఉన్న కోచింగ్ సెంటర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లేందుకు కిందకు దిగుతుండగా దాదాపు 45 నిమిషాల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు.

By అంజి  Published on  4 Aug 2024 7:00 PM IST
IAS aspirants, Lucknow coaching centre, UPSC civil services, Lucknow, Gomti Nagar

లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన ఐఏఎస్ అభ్యర్థులు.. చివరికి..

లక్నోలోని గోమతి నగర్‌లో ఉన్న కోచింగ్ సెంటర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లేందుకు కిందకు దిగుతుండగా దాదాపు 45 నిమిషాల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుయారు. చివరకు వారు ఈ పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. విద్యార్థులు యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. రాత్రి 8 గంటలకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ అకస్మాత్తుగా అంతస్తుల మధ్య ఆగిపోయింది. కిందకు వెళ్తున్న సమయంలో లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురై సహాయం కోసం అరిచారు.

అయినప్పటికీ వారిని రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. వారు లిఫ్ట్‌లో చిక్కుకోవడంతో శోభా సింగ్ అనే విద్యార్థిని పరిస్థితి గురించి తన భర్త పవన్ సింగ్‌కు తెలిపింది. అతను కోచింగ్ సెంటర్‌కు చేరుకుని లిఫ్ట్‌ను సరిచేసి తన భార్యను, ఇతర విద్యార్థులను రక్షించాలని అధికారులను వేడుకున్నాడు. అయితే, ఎలాంటి సహాయం అందించలేదు.

పవన్ తన భార్య లిఫ్ట్‌లో చిక్కుకున్న వీడియోను రికార్డ్ చేశాడు,.సహాయం లేకపోవడాన్ని ఎత్తి చూపాడు. అది త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన లిఫ్ట్‌ ఆపరేటర్‌ సహాయంతో లోపాన్ని సరిచేసి, చిక్కుకుపోయిన విద్యార్థులను రక్షించారు. ఇద్దరు విద్యార్థులను సురక్షితంగా రక్షించారు. లిఫ్ట్‌కు సంబంధించిన మాస్టర్ కీ సెక్యూరిటీ గార్డు వద్ద లేకపోవడంతో విద్యార్థులను రక్షించడంలో జాప్యం జరిగిందని ఆ తర్వాత తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక ఎలుక మెటల్ తాడులో ఇరుక్కుపోయి, లిఫ్ట్ యొక్క విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఐదవ అంతస్తులో ఆగిపోయింది.

Next Story