జైలులో ఉన్న నా కొడుకును కలవను : ప్రజ్వల్‌ రేవణ్ణ తండ్రి

జైలులో ఉన్న ప్రజ్వల్‌ను కలిసేందుకు తాను వెళ్లనని జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, జేడీ(ఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ తండ్రి హెచ్‌డి రేవణ్ణ మంగళవారం ప్రకటించారు

By Medi Samrat  Published on  2 July 2024 4:19 PM IST
జైలులో ఉన్న నా కొడుకును కలవను : ప్రజ్వల్‌ రేవణ్ణ తండ్రి

జైలులో ఉన్న ప్రజ్వల్‌ను కలిసేందుకు తాను వెళ్లనని జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, జేడీ(ఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ తండ్రి హెచ్‌డి రేవణ్ణ మంగళవారం ప్రకటించారు. జెడి(ఎస్) ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ ఇద్దరు కుమారులు లైంగిక వేధింపుల కేసుల్లో అరెస్టయ్యారు. “సూరజ్ త్వరలో క్లీన్‌గా బయటకు వస్తాడు” అని రేవణ్ణ చెప్పారు.

మైసూరులో హెచ్‌డి రేవణ్ణ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. “నేను జైలులో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణను కలవడానికి వెళ్ళను. ఆయన్ను కలవడానికి వెళ్తే.. నేను ఆయనకు ఏదో చేయ‌డానికి వెళ్లాన‌ని చెబుతారు. ఈ నేపథ్యంలో నేను వెళ్లను అని పేర్కొన్నారు. ఇప్పుడు మాకు దేవుడు మాత్రమే ఉన్నాడు. సోమవారం నా భార్య ప్రజ్వల్‌ని కలవడానికి జైలుకు వెళ్లింది. తల్లీ కొడుకులు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. నేను కూడా అడగలేదు అని హెచ్‌డీ రేవణ్ణ తెలిపారు.

సూరజ్ రేవణ్ణ గురించి మాట్లాడుతూ.. “అతను త్వరలో క్లీన్‌గా బ‌య‌ట‌కు వస్తాడనే నమ్మకం నాకు ఉంది. కేసు కోర్టులో ఉన్నందున నేను మరే ఇతర విషయాల గురించి మాట్లాడను. అంతా అయిపోనివ్వండి, నేను ప్రతిదీ వివరిస్తాను అని పేర్కొన్నారు.

కష్టాలు అత్యంత శక్తివంతమైన వ్యక్తులకు వస్తాయి.. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కుంగిపోను. 30 ఏళ్లుగా రాజకీయాలు చేశాను. నేను ఇలాంటి అనేక పరిస్థితులను ఎదుర్కొన్నానని అన్నారు.

ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం, కిడ్నాప్, బెదిరింపులు, లైంగిక చర్యలను వీడియో గ్రాఫింగ్ చేసినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసు దేశాన్ని కదిలించింది. ఇక జెడి(ఎస్) కార్యకర్తలపై బలవంతంగా అసహజ సెక్స్‌కు పాల్పడ్డారనే ఆరోపణలను అతని సోదరుడు సూరజ్ రేవణ్ణ ఎదుర్కొంటున్నారు.

Next Story