ఇద్దరు పిల్లలు ఉన్నా.. భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త

పెళ్లయ్యి ఏళ్లు అవుతున్నా.. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా తన భార్యను ఆమె ప్రియడికి ఇచ్చి వివాహం జరిపించాడు.

By Srikanth Gundamalla  Published on  16 Nov 2023 6:45 PM IST
husband,  married,  wife,   boyfriend,

ఇద్దరు పిల్లలు ఉన్నా.. భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆయా కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. కొందరు పిల్లలు తండ్రులను కోల్పోతే.. ఇంకొందరు తమ తల్లులకు దూరం అవుతున్నారు. అయితే.. పెళ్లి అయ్యాక భార్య మరొకరితో సాన్నిహిత్యంగా ఉండటం.. లేదంటే ప్రియుడిని మర్చిపోలేక సంతోషంగా లేకపోవడం జరుగుతూ ఉంటాయి. సరిగ్గా బీహార్‌లో కూడా ఇలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది. అయితే.. అతను ఎవరూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లయ్యి ఏళ్లు అవుతున్నా.. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా తన భార్యను ఆమె ప్రియడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

బీహార్‌లోని బేగుసరాయ్‌ జిల్లా దాహియా గ్రామానికి చెందిన అజయ్‌ కుమార్‌ కు 2018లో కాజల్‌ అనే మహిళతో వివాహం జరిగింది. బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. అయితే.. కాజల్‌ అంతకుముందే ఆఘాపూర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ ఠాకూర్‌ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లోనూ పెళ్లికి ముందే ఈ విషయం చెప్పింది. కానీ.. వారు ఆమె ప్రేమను అంగీకరించలేదు. చేసేది లేక తల్లిదండ్రులు చూపించిన అజయ్‌ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. అయితే.. వివాహం తర్వాత కూడా ఆమె ప్రియుడితో సన్నిహితంగా ఉండటం కొనసాగించింది.

ఈ విషయం ఇటీవల తెలుసుకున్న భర్త అజయ్‌ కుమార్‌.. భార్య కాజల్‌ను నిలదీసి అడిగాడు. దాంతో.. విషయం మొత్తం బయటపడింది. కాజల్‌ తన ప్రియుడితో బంధాన్ని తెంచుకోలేనని తెగేసి చెప్పింది. దాంతో.. భర్త కూడా ఆమె ప్రేమను అర్థం చేసుకున్నాడు. తనతో ఉండి సంతోషంగా లేదని తెలుసుకున్నాడు. మరో ఆలోచన లేకుండా రాజ్‌కుమార్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు భర్త అజయ్. ఆమె కొత్త కాపురానికి తన పిల్లలు అడ్డురావొద్దని వారి బాధ్యతను తానే చూసుకుంటానని చెప్పాడు.

దీని గురించి మాట్లాడిన అజయ్‌కుమార్.. మొదట తన భార్య ఎఫైర్ గురించి తెలుసుకునిషాక్ అయ్యా అని చెప్పాడు. కానీ వివాహం నుంచి తనకు విముక్తి కలిగించాలనే తన ప్రియుడితో వివాహం జరిపించానన్నాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల ఆగ్రహం నుంచి కూడా ఆమెను కాపాడగలిగా అని అజయ్‌కుమార్ చెప్పాడు.

Next Story