నా భార్య‌ను కాపాడండి.. ఓ భ‌ర్త ఆవేద‌న‌

Husband request to admit his wife. ' నా భార్య చచ్చిపోతోంది.. ఆమెను అడ్మిట్ చేసుకోండి' అని కనబడిన వారినల్లా అర్థించాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 April 2021 1:44 AM GMT
husband request

కరోనా తన కబంద హస్తాలతో ఎంతో మందిని తన అక్కున చేర్చుకుంటున్న వేళ.. దేశంలో ని సుమారు అన్నినగరాల్లోని ఆసుపత్రుల వద్ద దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. హాస్పిటల్స్ అన్నీ కోవిడ్ రోగులతో కిక్కిరిసిపోతుండటంతో బెడ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. వందలాది బాధితులు ఆస్పత్రుల ఆవరణల్లోనే పడిగాపులు పడుతున్నారు. ఢిల్లీలోని అతి పెద్ద లోక్ నాయక్ జయప్రకాశ్ కోవిడ్ ఆసుపత్రి ఎప్పటిలాగే రోగులు, వారి బంధువులతో నిండిపోయింది. తమవారిని అడ్మిట్ చేయించుకోవాలంటూ అనేకమంది డాక్టర్లను, వైద్య సిబ్బందిని ప్రాధేయపడుతున్నారు. పడకలు లేవని చెప్పినా..ఏదో విధంగా సర్దుబాటు చేయాలంటూ దీనంగా అర్థిస్తున్నారు.

ఇలాంటి వారిలో అస్లం ఖాన్ అనే వ్యక్తి ఆవేదన అందర్నీ కలిచివేసింది. 30 ఏళ్ళ తన భార్య రూబీ ఖాన్ కి కరోనా పాజిటివ్ సోకిందని, ఆమెను తన బైక్ పై కూర్చోబెట్టుకుని మూడు ఆస్పత్రులు తిరిగినా ఎక్కడా అడ్మిట్ చేసుకోలేదని ఆయన వాపోయాడు. దీంతో ఈ ఆసుపత్రికి తీసుకువచ్చ్చానని తెలిపాడు. ' నా భార్య చచ్చిపోతోంది.. ఆమెను అడ్మిట్ చేసుకోండి' అని కనబడిన వారినల్లా అర్థించాడు. ఈ సంఘటన అక్కడున్నావారిని అందరినీ కలచివేసింది. ఇక గతంలో లో తాము కరోనా టెస్టు చేయించుకున్నామని, నెగెటివ్ వచ్చిందని, అయినా ఇప్పుడు శ్వాస సరిగా తీసుకోలేక ఇబ్బందిపడుతున్నామని కొందరు, ఆక్సిజన్ సిలెండర్ దొరికినా ఆసుపత్రి లో బెడ్ దొరక్క రోడ్డు మీదే పడిగాపులు కాస్తున్నవారు మరికొందరు.

మరోవైపు మ్యాక్స్‌ హాస్పిటల్స్‌ దాఖలు చేసిన ఓ అత్యవసర పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.ఎన్నడూ లేని విధంగా కేంద్రంపై విరుచుకుపడింది. ఎలాగైనా ఆక్సిజన్ కొరతను తీర్చాలని, రోగులందరికీ ఆక్సిజన్ అందేలా చూడాలని సూచించింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత నివారణకు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకోలేకపోయిందని మండిపడింది. పరిశ్రమలలో తయారుచేసి అక్కడే వినియోగిస్తున్న ఆక్సిజన్‌ను కొన్నాళ్లపాటు దిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు మళ్లించటంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది.


Next Story