పాకిస్థాన్ గెలిచింద‌ని భార్య ఆనందం.. పోలీసుల‌కు భ‌ర్త ఫిర్యాదు

Husband files complaint as wife celebrates Pakistan's victory.టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా అక్టోబ‌ర్ 24న భార‌త్‌,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Nov 2021 12:38 PM IST
పాకిస్థాన్ గెలిచింద‌ని భార్య ఆనందం.. పోలీసుల‌కు భ‌ర్త ఫిర్యాదు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా అక్టోబ‌ర్ 24న భార‌త్‌, పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఓట‌మి పాలైంది. ఈ విష‌యాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇప్ప‌టికి కూడా ప‌లువురు ఆట‌గాళ్ల‌ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రామ్‌పుర్‌కు చెందిన మ‌హిళ పాక్ గెలుపు పై సంబ‌రాలు చేసుకుంది. దీంతో ఆగ్ర‌హించిన ఆమె భ‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. రామ్‌పుర్‌లో ఇషాన్ మియాన్ త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. భార‌త్‌-పాక్ మ్యాచ్‌ను ఢిల్లీలో త‌న స్నేహితుల‌తో క‌లిసి చూశాడు. అంద‌రు అభిమానుల్లాగే ఇండియా గెల‌వ‌క‌పోవ‌డంతో నిరాశ చెందాడు. అదే స‌మ‌యంలో త‌న వాట్సాప్ చూడ‌గా.. అందులో త‌న భార్య స్టేట‌స్ క‌నిపించింది. అందులో ఆమె పాక్ గెలుపును ఆనందిస్తున్న‌ట్లుగా ఉంది. దీంతో ఆగ్ర‌హించిన ఇషాన్ మియాన్ రామ్‌పుర్ ఎస్పీని క‌లిసి ఈ విష‌యంపై ఫిర్యాదు చేశాడు. త‌న భార్య‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరాడు. ర‌బియా స్టేట‌స్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. దీనిపై నెటీజ‌న్లు త‌మదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Next Story