వింత సంఘటన.. తన భార్యను తమ్ముడికిచ్చి పెళ్లి చేసిన అన్న

Husband ends 24-year wedlock, gets wife married to his brother. ఓ వ్యక్తి తన భార్యను తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఘటన వెస్ట్‌ బెంగాల్‌లోని

By అంజి  Published on  31 Oct 2022 8:19 AM IST
వింత సంఘటన.. తన భార్యను తమ్ముడికిచ్చి పెళ్లి చేసిన అన్న

ఓ వ్యక్తి తన భార్యను తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఘటన వెస్ట్‌ బెంగాల్‌లోని నదియా జిల్లాలో చోటు చేసుకుంది. దీనంతటికి కారణంగా భార్య, భర్త తమ్ముడితో వివాహేతర సంబంధం నడపడమే. ఈ విషయం తెలుసుకుని భర్త.. వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. ఈ వింత సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శాంతిపూర్‌ మున్సిపాలిటీలోని వార్డ్‌ నెంబర్‌ 1లో నివసించే అమూల్య దేబ్‌నాథ్‌కు 24 ఏళ్ల క్రితం దీపాళి దేబ్‌నాథ్‌ పెళ్లి జరిగింది. వారికి 22 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అతనికి కూడా వివాహం జరిగింది. కోడలు కొన్ని రోజుల నుంచి పుట్టింట్లో ఉంటోంది.

మరోవైపు భర్త అమూల్య దేబ్‌నాథ్‌ వృత్తిరీత్యా వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే దీపాళి.. తన భర్త తమ్ముడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చాలా నెలలుగా దీపాళిపై భర్త అమూల్య దేబ్‌నాథ్‌ అనుమానంతో ఉన్నాడు. స్థానిక నివాసితుల నుండి తన భార్య గురించి భిన్నమైన కథనాల విన్నాడు. అయితే గత నెలలో భర్త సందేహాలు రెట్టింపయ్యాయి. ఒక రోజు భర్త.. వారిని ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ విషయాన్ని గ్రామస్తులందరికీ తెలియజేశాడు. అలాగే తన 24 ఏళ్ల వివాహాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇరుగుపోరుగు సమక్షంలో దీపాళికి, సోదరుడు కిషోబ్‌ దేబ్‌నాథ్‌ వివాహం జరిపించాడు.

Next Story