రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీలోనూ ఓడిపోవడం ఖాయం: అమిత్‌షా
గుజరాత్‌లోని ఛోటాడేపూర్ జిల్లాలోని బోడెలిలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది.
By Srikanth Gundamalla Published on 4 May 2024 8:01 PM ISTరాహుల్‌గాంధీ రాయ్‌బరేలీలోనూ ఓడిపోవడం ఖాయం: అమిత్‌షా
గుజరాత్‌లోని ఛోటాడేపూర్ జిల్లాలోని బోడెలిలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌సా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. వయనాడ్, రాయ్‌బరేలీ స్థానాల నుంచి ఎన్నికల బరిలో నిలిచిన రాహుల్‌గాంధీ ఓడిపోతారని అన్నారు. రాయ్‌బరేలీలో అయితే భారీ తేడాతో ఓటమిని చూస్తారని జోస్యం చెప్పారు.
రాహుల్‌గాంధీ గతంలో అమేథీలో ఓడిపోయినప్పుడు వయనాడ్ వెళ్లారని అమిత్‌షా గుర్తు చేశారు. ఈ సారి వయనాడ్ నుంచి కూడా ఓడిపోతాననే భయంతో ఆయన రాయ్‌బరేలి నుంచి కూడా పోటీ చేస్తున్నారంటూ అమిత్‌షా ఎద్దేవా చేశారు. అయితే.. రాహుల్‌గాంధీకి అమిత్‌షా ఓ సలహా ఇచ్చారు. సమస్య రాహుల్‌గాంధీ పోటీ చేసే స్థానాల్లో లేదనీ.. ఆయనలోనే ఉందంటూ విమర్శించారు. కాబట్టి రాయ్‌బరేలిలో కూడా రాహుల్ ఓటమి పక్కా అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. దళితులు, గిరిజనులను, వెనుకబడ్డ తరగతుల కోసం ఉద్దేశించిన కోటాను ప్రతిపక్ష ఇండియా కూటమి దోచుకుంటోందని అమిత్‌షా ఆరోపించారు.
అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ సర్కార్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందని అమిత్‌షా ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 శాతం కోటాను దోచుకుని ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. అంతేకాదు.. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కూడా అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును కూడా వ్యతిరేకిస్తోందన్నారు. అందుకే ఈసారి జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు సరైన బుద్ధి చెప్పాలనీ.. పాతాళానికి తొక్కేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రజలకు పిలుపునిచ్చారు.