1993 నుండి ఆగిన పూజలు.. ఇప్పుడు చేసుకోవచ్చంటూ కోర్టు తీర్పు

వారణాసి కోర్టు బుధవారం నాడు హిందూ భక్తులను జ్ఞానవాపి మసీదులో

By Medi Samrat  Published on  31 Jan 2024 7:39 PM IST
1993 నుండి ఆగిన పూజలు.. ఇప్పుడు చేసుకోవచ్చంటూ కోర్టు తీర్పు

వారణాసి కోర్టు బుధవారం నాడు హిందూ భక్తులను జ్ఞానవాపి మసీదులో సీలు చేసిన నేలమాళిగలో పూజించడానికి అనుమతించింది. కోర్టు ఆదేశం ప్రకారం, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు లోపల నిషేధిత ప్రాంతం అయిన 'వ్యాస్ కా టెఖానా'లో ఇప్పుడు హిందూ భక్తులు ప్రార్థనలు చేయవచ్చు. భక్తులు నిర్వహించే 'పూజ'కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. దానికి పూజారిని నామినేట్ చేయాలని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టును కోరింది.

మసీదు ప్రాంగణంలోని హిందూ దేవతల ప్రతిమలకు పూజలు చేసేందుకు వారణాసి కోర్టు బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. పూజలు చేసుకొనేందుకు ఏర్పాట్లు చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది. వారంరోజుల్లో పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ ప్రకటించింది. ఇది హిందువుల అతి పెద్ద విజయంగా కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ ప్రకటించింది. హిందూ భక్తులు పూజలు చేసేందుకు కోర్టు ఆదేశాలతో అనుమతి లభించిందని న్యాయవాది తెలిపారు. ఈ ప్రాంతంలో 1993 నుండి పూజలు ఆగిపోయాయి.


Next Story