మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చంటూ సంచలన తీర్పు

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని ‘వ్యాస్ కా తేఖానా’లో హిందువులు పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్థించింది.

By అంజి
Published on : 26 Feb 2024 11:29 AM IST

Hindus, Gyanvapi cellar, Allahabad High Court , Muslim

మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చంటూ సంచలన తీర్పు 

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని ‘వ్యాస్ కా తేఖానా’లో హిందువులు పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. వారాణాసి కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ (ఏఐఎంసీ) అభ్యర్థనను తాజాగా తోసిపుచ్చింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేయాలని ఏఐఎంసీ నిర్ణయించింది. తుది వాదనలు విన్న జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తీర్పు వెల్లడించారు. కోర్టు తీర్పుపై హిందూ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. మసీదు బేస్‌మెంట్‌లో నాలుగు తేఖానాలు (సెల్లార్‌లు) ఉన్నాయి. అందులో ఒకటి వ్యాస్ కుటుంబం అధీనంలో ఉంది.

వారణాసిలోని జ్ఞాన్‌వాపి ప్రాంగణంలోని దక్షిణ సెల్లార్‌లో పూజలు చేసేందుకు హిందువులను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న 'వ్యాస్ కా తేఖానా'లో హిందువులు పూజలు చేసేందుకు అనుమతించిన వారణాసి కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ బెంచ్ విచారించింది. జనవరి 31న వారణాసి కోర్టు జ్ఞానవాపి ప్రాంగణంలోని దక్షిణ సెల్లార్‌లో పూజలు చేసేందుకు హిందూ భక్తులను అనుమతించింది.

Next Story