స్కూటీ ధర రూ.30 వేలే.. కానీ చలాన్లు రూ.3 లక్షలు
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి.
By Srikanth Gundamalla Published on 19 Dec 2023 5:01 AM GMTస్కూటీ ధర రూ.30 వేలే.. కానీ చలాన్లు రూ.3 లక్షలు
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రభుత్వం, పోలీసు అధికారులు వాహనాదారులు, ప్రయాణికుల క్షేమం గురించి ఆలోచించే ట్రాఫిక్ నిబంధనలను ప్రవేశపెట్టారు. అయితే.. ప్రాణాలపై తీపిలేని చాలా మంది నిబంధనలను ఉల్లంఘిస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. వారితో పాటు ఎదుటివారి ప్రాణాలనూ రిస్క్‌లో పెడుతున్నారు. అయితే.. చలాన్లు విధించడం ద్వారా ఇలాంటి వారు అదుపులో ఉంటారని అధికారులు వాటిని విధిస్తుంటారు. కానీ.. వీటిని కూడా తప్పించుకుంటూ కొందరు తిరుగుతారు. కొన్ని వాహనాలపై అయితే.. భారీ ఎత్తున చలాన్లు ఉంటాయి. ఈక్రమంలోనే కర్ణాటకకు చెందిన ఓ స్కూటీపై ఉన్న చలాన్లను చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
కర్ణాటకకు చెందిన కేఏ04KF9072 రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న స్కూటీపై పెద్ద ఎత్తున చలాన్లు ఉన్నాయి. ఈ స్కూటీ ఫిబ్రవరి 2022లో విక్రయించబడింది. బెంగళూరు రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు చాలా సార్లు ఉల్లంఘించారు. అయితే. ఈ స్కూటీ ధర రూ.30వేల వరకు ఉంటుంది. కానీ.. ఈ వాహనంపై ఉన్న జరిమానా మాత్రం లక్షల్లో ఉంది. ఏకంగా రూ.3.22 లక్షల చలాన్లు ఉన్నాయి. అవును ఇది నిజమే. పొరపొటున కూడా అధికారులు ఎక్కువ అమౌంట్ వేశారనీ కూడా అనుకోవద్దు. సదురు స్కూటీ వాహనదారుడి నిర్లక్ష్యమే ఈ చలాన్లకు కారణం.
బెంగళూరు రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలను ఈ స్కూటీ వాహనదారుడు 643 సార్లు ఉల్లంఘించాడు. దాంతో.. రూ.3 లక్షలకు పైగా విధించారు పోలీసులు. స్కూటీపై ప్రయానించిన వ్యక్తికి హెల్మెట్ లేకపోవడం.. సిగ్నల్ జంపింగ్ ద్వారా 643 సార్లు నిబంధనలు ఉల్లంఘించాడు. ట్రాఫిక్ కెమెరాల్లో ఇవన్నీ రికార్డు అయ్యాయి. మొత్తం చలాన్ల ద్వారా చెల్లించాల్సిన నగదును లెక్కించగా రూ.3.22 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో చలాన్లు కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తి ఎవరా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా పెద్దమొత్తంలో అమౌంట్‌ను చూసి షాక్ అవుతున్నారు.