వాలెంటైన్స్ డే నాడు భార్య 'లవ్ స్టోరీ' బట్టబయలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

వాలెంటైన్స్ డే రోజున ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. తన భార్య మరొక వ్యక్తితో కలిసి తిరుగుతుండగా..

By -  అంజి
Published on : 15 Feb 2026 6:56 AM IST

Hapur Public Brawl, Husband Catches Wife with Lover, Uttar Pradesh News, Valentines Day Viral Video, Meerut Road Bridge Fight

వాలెంటైన్స్ డే నాడు భార్య 'లవ్ స్టోరీ' బట్టబయలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

వాలెంటైన్స్ డే రోజున ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. తన భార్య మరొక వ్యక్తితో కలిసి తిరుగుతుండగా భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో నడిరోడ్డుపై తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరట్ రోడ్డు వంతెనపై తన భార్య మరొక వ్యక్తితో కలిసి బైక్‌పై వెళ్తుండటాన్ని భర్త గమనించాడు. వెంటనే వారిని అడ్డుకుని నిలదీశాడు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య మాటా మాటా పెరిగి, అది కాస్తా భౌతిక దాడికి దారితీసింది.

ఆగ్రహంతో ఊగిపోయిన భర్త.. భార్యను, ఆమె ప్రేమికుడిని రోడ్డుపైనే అందరూ చూస్తుండగా చితకబాదాడు. వారు కూడా ఎదురుదాడికి దిగడంతో అక్కడ పెద్ద రచ్చ జరిగింది. స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి ఈ తతంగం మొత్తాన్ని వీడియోలు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గొడవను ఆపారు.

భర్త, భార్య మరియు ఆమె ప్రేమికుడిని హాపూర్ నగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇన్ స్పెక్టర్ వినోద్ పాండే తెలిపిన వివరాల ప్రకారం.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు గానూ భర్తపై, భార్య ప్రేమికుడిపై పలు సెక్షన్ల కింద చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.

Next Story