అయోధ్యలో హై అలర్ట్
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న శ్రీరాముడి ఆలయంపై ఉగ్రదాడి జరగబోతోందని బెదిరింపులు వచ్చాయి.
By M.S.R
అయోధ్యలో హై అలర్ట్
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న శ్రీరాముడి ఆలయంపై ఉగ్రదాడి జరగబోతోందని బెదిరింపులు వచ్చాయి. జమ్మూలో ఇటీవల జరిగిన మూడు ఉగ్రవాద దాడుల తరువాత, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ నుండి వచ్చిన ఆడియో బెదిరింపులో రామ మందిరంపై బాంబు దాడి చేయబోతున్నామని ఉంది. ఈ ఆడియో బెదిరింపు రాగానే పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆలయం చుట్టూ భద్రతను పెంచింది.
అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తరువాత, ఆలయం ప్రారంభ రోజున కొన్ని లక్షల మంది సందర్శకులను చూసింది. ఆలయం రోజువారీ సందర్శకులు సగటున 100,000 నుండి 150,000 వరకు ఉన్నారు. జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాది అమీర్ నుండి వచ్చిన ఒక ఆడియో సందేశం వైరల్ అయ్యింది. ఆలయంపై బాంబు దాడి చేస్తామని అందులో తెలిపారు. అమీర్ తన ముగ్గురు సహచరులు ఇప్పటికే తమ ప్రాణాలను త్యాగం చేశారని.. ఇక ఆలయాన్ని ధ్వంసం చేయాలని అనుకుంటున్నామని అందులో చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఆడియో సందేశం ప్రామాణికతను భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఈ ఆడియో క్లిప్ వైరల్ అయిన తర్వాత కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలను హై అలర్ట్‌లో ఉంచారు.