చెన్నై యంత్రాంగంపై హీరో విశాల్‌ ఆగ్రహం

చెన్నై వరదల్లో అతలాకుతలమవుతున్న నేపథ్యంలో హీరో విశాల్ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యంత్రాంగం విఫలమైందని ట్విటర్‌లో మండిపడ్డారు.

By అంజి
Published on : 5 Dec 2023 9:13 AM IST

Hero Vishal, Greater Chennai Corporation, Cyclone Michaung , DMK Govt

చెన్నై యంత్రాంగంపై హీరో విశాల్‌ ఆగ్రహం

చెన్నై వరదల్లో అతలాకుతలమవుతున్న నేపథ్యంలో హీరో విశాల్ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యంత్రాంగం విఫలమైందని ట్విటర్‌లో మండిపడ్డారు. 'చెన్నై మేయర్ సహా అధికారులు అందరూ మీ మీ కుటుంబాలతో క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా.. ఈ వరదల్లో నీరు మీ ఇళ్లలోకి రాదని అనుకుంటున్నా. మీ ఇళ్లకు పూర్తి విద్యుత్‌, ఆహారం ఉంటుంది. కానీ సాధారణ ఓటర్లకు అలాంటి పరిస్థితి' లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాల్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

''మీరున్న ఈ సిటీలోనే మేం ఉన్నాం.. కానీ మీలాంటి స్థితిలో మేం లేము.. తుపాను నీళ్ల డ్రైన్ ప్రాజెక్ట్ చేసింది చెన్నై కోసమా? సింగపూర్ కోసమా?.. 2015లో మేం అంతా ముందుకు వచ్చి సాయం చేశాం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేం సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్దంగానే ఉంటాం.. ఎనిమిదేళ్ల తరువాత కూడా అలాంటి పరిస్థితే.. అంతకు మించి దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి'' అంటూ ట్విటర్‌లో చెన్నై కార్పొరేషన్‌పై విశాల్‌ ఫైర్‌ అయ్యారు.

మరోవైపు తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మిచైంగ్‌ తుపాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు చెన్నైతో సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఆయా ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. వరద ప్రవాహంలో కార్లు, బైకులు కొట్టుకుపోయారు. మరోవైపు సీఎం స్టాలిన్‌ ఆదేశాలతో అధికారులు యుద్ధప్రతిపాదికన రెస్క్యూ చర్యలు చేపట్టారు. 2015లో వర్షం, వరదల తర్వాత చెన్నైలో ఇప్పుడు అత్యధిక వర్షపాతం నమోదైంది.

Next Story