చంద్రయాన్-3 నుండి సెంగోల్ దాకా.. 2023లో భారతీయులు వెతికిన టాప్ విషయాలు

2023 ముగింపు దశకు చేరుకోవడంతో, Google ఏడాది పొడవునా భారతదేశంలో ఎక్కువగా వెతికిన అంశాలు, ప్రశ్నలు వంటి విషయాలపై ఓ డేటాను వెల్లడించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Dec 2023 2:30 PM IST
Indians, Google search, Chandrayaan-3, Sengol

చంద్రయాన్-3 నుండి సెంగోల్ దాకా.. 2023లో భారతీయులు వెతికిన టాప్ విషయాలు 

2023 ముగింపు దశకు చేరుకోవడంతో, Google ఏడాది పొడవునా భారతదేశంలో ఎక్కువగా వెతికిన అంశాలు, ప్రశ్నలు వంటి విషయాలపై ఓ డేటాను వెల్లడించింది. 2023 లో ఎక్కువగా సెర్చ్ చేసిన వార్తలు, వినోదం, మీమ్స్, ప్రయాణం, వంటకాలు.. లాంటి ఎన్నో కేటగిరీలు ఉంటాయి.

ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతో పాటు చంద్రునిపై విజయవంతంగా దిగిన నాల్గవ దేశంగా భారత్‌ను గుర్తించడం ద్వారా చంద్రయాన్-3 ఈ ఏడాది చోటు చేసుకున్నఅద్భుతమైన సంఘటన. దీని గురించి తెలుసుకోడానికి భారతీయులు ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేశారు.

భారతీయ ఇంటర్నెట్ యూజర్లకు ఆసక్తిని కలిగించిన టాప్ 10 ఈవెంట్‌లు:

1. చంద్రయాన్-3

2. కర్ణాటక ఎన్నికల ఫలితాలు

3. ఇజ్రాయెల్ వార్తలు

4. సతీష్ కౌశిక్

5. బడ్జెట్ 2023

6. టర్కీ భూకంపం

7. అతిక్ అహ్మద్

8. మాథ్యూ పెర్రీ

9. మణిపూర్ వార్తలు

10. ఒడిశా రైలు ప్రమాదం

అక్టోబర్ 7న జరిగిన ఆకస్మిక దాడితో ప్రారంభమైన ఇజ్రాయెల్, హమాస్ మధ్య వివాదం గురించి కూడా వినియోగదారులు ఆసక్తిని కనబరిచారు. నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ చనిపోయిన విషయం.. ఫ్రెండ్స్ స్టార్ మాథ్యూ పెర్రీ గురించి కూడా తెలుసుకోవాలని భారత ఇంటర్నెట్ యూజర్లు ఆసక్తిని కనబరిచారు.

Google చాట్‌జిపిటి, ఇన్‌స్టాగ్రామ్, యూనిఫాం సివిల్ కోడ్ గురించిన ప్రశ్నలతో 'ఇయర్ ఇన్ సెర్చ్ 2023' ఫలితాలను గూగుల్ ఇచ్చింది. ప్రశ్నల జాబితా ఇలా ఉంది:

ఎక్కువగా గూగుల్ ని అడిగిన ప్రశ్నలు:

1. G20 అంటే ఏమిటి

2. UCC అంటే ఏమిటి

3. ChatGPT అంటే ఏమిటి

4. హమాస్ అంటే ఏమిటి

5. 28 సెప్టెంబర్ 2023న ఏమిటి

6. చంద్రయాన్ అంటే ఏమిటి 3

7. Instagramలో థ్రెడ్‌లు అంటే ఏమిటి

8. క్రికెట్‌లో టైమ్డ్ అవుట్ అంటే ఏమిటి?

9. IPLలో ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏమిటి

10. సెంగోల్ అంటే ఏమిటి

'ఎలా చేయాలి' జాబితాలో చర్మం, జుట్టుకు సూర్యరశ్మి వల్ల కలిగే హానిని నివారించడం నుండి YouTubeలో ఫాలోవర్స్ ను సాధించడం వరకు పలు ప్రశ్నలను గూగుల్ ని అడిగారు.

అందుకు సంబంధించిన శోధనలు:

1. చర్మం, జుట్టుకు సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాన్ని ఎలా నివారించాలి

2. YouTubeలో నా మొదటి 5000 అనుచరులను ఎలా చేరుకోవాలి

3. కబడ్డీలో ఎలా రాణించాలి

4. కారు మైలేజీని ఎలా మెరుగుపరచాలి

5. చెస్ గ్రాండ్ మాస్టర్ ఎలా అవ్వాలి

6. రక్షాబంధన్ రోజున నా సోదరిని ఎలా ఆశ్చర్యపరచాలి

7. స్వచ్ఛమైన కంజీవరం పట్టు చీరను ఎలా గుర్తించాలి

8. ఆధార్‌తో పాన్ లింక్‌ని ఎలా తనిఖీ చేయాలి

9. WhatsApp ఛానెల్‌ని ఎలా సృష్టించాలి

10. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్‌ను ఎలా పొందాలి

స్పోర్ట్స్ విభాగంలో, సెర్చ్‌లలో క్రికెట్ చాలా వరకూ ఆధిపత్యం చెలాయించింది. భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ప్రజాదరణను చూపిస్తోంది:

టాప్ స్పోర్ట్స్ సెర్చ్ విషయాలు:

1. ఇండియన్ ప్రీమియర్ లీగ్

2. క్రికెట్ ప్రపంచ కప్

3. ఆసియా కప్

4. మహిళల ప్రీమియర్ లీగ్

5. ఆసియా క్రీడలు

6. ఇండియన్ సూపర్ లీగ్

7. పాకిస్థాన్ సూపర్ లీగ్

8. యాషెస్

9. మహిళల క్రికెట్ ప్రపంచ కప్

10. ఎస్‌ఏ20

Next Story