రోడ్లపై ఉమ్మివేస్తే భారీ జరిమానా.. ఎక్కడో తెలుసా?

వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మివేయడం వంటి అలవాటు ఉన్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

By Knakam Karthik  Published on  5 Feb 2025 10:41 AM IST
West Bengal, Cm Mamatha Benerjee, Heavy fine for spitting on the roads

రోడ్లపై ఉమ్మివేస్తే భారీ జరిమానా.. ఎక్కడో తెలుసా?

వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు, పాన్ మసాలా నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం పశ్చిమ బెంగాల్‌లోని ప్రధాన సమస్యల్లో ఒకటి. దీన్ని అరికట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మివేయడం వంటి అలవాటు ఉన్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

ఇందులో భాగంగానే రాబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది. అటువంటి నేరాలకు భారీ జరిమానా విధించే నిబంధనలతోఎ కూడిన బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ మంత్రి వర్గ సమావేశంలో ఈ బిల్లుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి చట్టం ఉన్నప్పటికీ మార్పులు, జరిమానాతో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు బెంగాల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Next Story