ఆ గ్రామంలో కలకలం రేపుతోన్న వరుస మరణాలు.. 15 రోజుల్లో 12 మంది మృతి

హర్యానా రాష్ట్రం పల్వాల్ జిల్లాలోని చాయన్సా గ్రామంలో గత 15 రోజుల్లో ఐదుగురు పాఠశాల విద్యార్థులతో సహా మొత్తం 12 మంది...

By -  అంజి
Published on : 16 Feb 2026 12:00 PM IST

Contaminated Water Deaths Haryana, Chayansa Village Water Crisis, Waterborne Diseases Outbreak, Palwal Health News, Indore Water Contamination, Noida Sector 29 Water Issues

ఆ గ్రామంలో కలకలం రేపుతోన్న వరుస మరణాలు.. 15 రోజుల్లో 12 మంది మృతి

హర్యానా రాష్ట్రం పల్వాల్ జిల్లాలోని చాయన్సా గ్రామంలో గత 15 రోజుల్లో ఐదుగురు పాఠశాల విద్యార్థులతో సహా మొత్తం 12 మంది మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. కలుషిత తాగునీరే ఈ మరణాలకు ప్రధాన కారణమని గ్రామస్తులు, ఆరోగ్య శాఖ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. చాయన్సా గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, వాంతులతో బాధపడుతున్నారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

బాధితుల్లో ఎక్కువ మంది కాలేయ సంబంధిత ఇన్ఫెక్షన్లు, మల్టీ-ఆర్గాన్ ఫెయిల్యూర్ (అవయవాల వైఫల్యం) వంటి సమస్యలతో మరణించారు. 5,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో మున్సిపల్ సరఫరా, భూగర్భ ట్యాంకులు, బయటి నుంచి తెచ్చే ట్యాంకర్ నీటిపై ప్రజలు ఆధారపడుతున్నారు. ఆరోగ్య శాఖ సేకరించిన 107 నీటి నమూనాల్లో 23 నమూనాలు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. వీటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందడమే కాకుండా, క్లోరినేషన్ సరిగ్గా లేదని తేలింది. 300 రక్త నమూనాలను సేకరించగా, కేవలం రెండు కేసుల్లోనే హెపటైటిస్ బి లేదా సి ఉన్నట్లు నిర్ధారణ అయింది. మిగిలిన మరణాలకు ఖచ్చితమైన కారణాన్ని కనుగొనేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story