వీడు మామూలోడు కాదు.. పదో తరగతి పరీక్షల్లో హైటెక్ కాపియింగ్

Haryana Student Had An Innovative Idea To Cheat.క‌ష్ట‌ప‌డి కాదు ఇష్ట‌ప‌డి చ‌దివితే ఎంతో జ్ఞానాన్ని పొంద‌వ‌చ్చు. అప్పుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2022 7:32 AM GMT
వీడు మామూలోడు కాదు.. పదో తరగతి పరీక్షల్లో హైటెక్ కాపియింగ్

క‌ష్ట‌ప‌డి కాదు ఇష్ట‌ప‌డి చ‌దివితే ఎంతో జ్ఞానాన్ని పొంద‌వ‌చ్చు. అప్పుడు ప‌రీక్ష‌ల్లో ఎలాంటి ప్ర‌శ్నలు ఎదురైనా స‌మాధానాలు రాయ‌వ‌చ్చు. అయితే.. కొంద‌రు విద్యార్థులు ప‌రీక్షా స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు చ‌ద‌వ‌రు. ఇంకొంద‌రు ఏమో ప‌రీక్ష‌ల్లో పాస్ కావ‌డానికి కాపీలు కొడుతుంటారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించేందుకు ఓ విద్యార్థి కాపీ కొడుతూ ప‌ట్టుబ‌డ్డాడు. అత‌డి తెలివితేట‌లు చూసిన అధికారులే ఆశ్చ‌ర్య‌పోయారు. చివ‌ర‌కు ఆ విద్యార్థిని డిబార్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. హ‌ర్యానా రాష్ట్రంలో ప్ర‌స్తుతం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. ఫ‌తేహాబాద్‌లోని ఓ ప‌రీక్షా కేంద్రంలో సోమ‌వారం ఆంగ్ల ప‌రీక్ష ప్రారంభ‌మైంది. ప‌రీక్ష ప్రారంభ‌మైన కాసేప‌టికీ ప‌రీక్షా కేంద్రానికి ఫ్ల‌యింగ్‌స్వ్కాడ్ వ‌చ్చారు. విద్యార్థులు ప‌రీక్ష‌లు ఎలా రాస్తున్నారో అని గ‌మ‌నిస్తుండ‌గా.. ఓ విద్యార్థి అనుమానాస్ప‌దంగా క‌నిపించాడు.

దీంతో ఆ విద్యార్థి ప్యాడ్‌ను ప‌రిశీలించ‌గా.. ప్యాడ్‌లోనే మొబైల్ అమ‌ర్చుకుని వ‌చ్చిన‌ట్లు గుర్తించారు. మొబైల్‌లో చూడ‌గా.. వాట్సాప్ చాట్‌లో స్లిప్పుల‌ను గుర్తించారు. దీంతో ఆ విద్యార్థిని ప‌రీక్షా కేంద్రం నుంచి బ‌య‌ట‌కు పంపించి డిబార్ చేశారు. ఇక అదే రోజున సుమారు 457 మంది విద్యార్థులు కాపీయింగ్‌లు పాల్ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story