హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం నర్వానాలోని బిధరానా గ్రామ సమీపంలోని హిసార్-చండీగఢ్ జాతీయ రహదారిపై సంభవించింది.
కురుక్షేత్రలోని మార్చేడి గ్రామం నుంచి రాజస్థాన్‌లోని గోగమేడికి టాటాఏఎస్ వాహనం బయల్దేరింది. ఈ క్రమంలోనే బిధరానా గ్రామ సమీపంలోకి రాగానే వెనుక నుంచివేగంగా వచ్చిన ఒక ట్రక్కు టాటీఏస్‌ను బలంగా ఢీకొట్టింది. దాంతో ప్రమాదం సంభవించింది. మీడియాకు అందిన సాచారం ప్రకారం మార్చేడి గ్రామానికి చెందిన 15 మంది గోగమేడికి టాటాఏస్‌లో ప్రయాణిస్తున్నారు. హిసార్-చండీగఢ్ జాతీయ రహదారిపై బిధరానా- సిమ్లా మధ్య కలపతో కూడిన ట్రక్కు.. టాటాఏస్‌ను వెనుక నుండి ఢీకొంది. దాంతో.. టాటాఏస్ ఒక గుంతలో పడిపోయింది. ఇతర వాహనదారులు ఈ ప్రమాదానికి గురైన బాధితులను గుంతలో నుంచి బయటకు తీశారు. ఆ తర్వాత నర్వాణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకి చేరుకున్నారు. ఏడు అంబులెన్స్‌లు కూడా అక్కడకి వచ్చాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఏడుగురు చనిపోయినట్లు వైద్యులు చనిపోయినట్లు చెప్పారు. మిగతా వారికి ఆస్పత్రల్లో వైద్యం అందిస్తున్నామని చెప్పారు.