ఆ రైల్వే స్టేషన్‌లో ప్రతీది ప్రత్యేకమే.. అందుకే 5 స్టార్ రేటింగ్.!

Habibganj station gets 5 star GEM rating for ECO friendly and sustainable design. దేశంలో మొదటిసారిగా ఓ రైల్వే

By అంజి  Published on  8 Sep 2021 7:47 AM GMT
ఆ రైల్వే స్టేషన్‌లో ప్రతీది ప్రత్యేకమే.. అందుకే 5 స్టార్ రేటింగ్.!

దేశంలో మొదటిసారిగా ఓ రైల్వే స్టేషన్‌ గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ 5 స్టార్ రేటింగ్‌ను అందుకుంది. మధ్యప్రదేశ్‌లోని హబీబ్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌కు అసోచామ్ గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ 5 స్టార్ అందించింది. దేశంలోని రైల్వే స్టేషన్ల ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే బోఫాల్ సమీపంలోని హబీబ్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌ రూపు రేఖలను రైల్వే శాఖ అధికారులు మార్చేశారు. రైల్వే స్టేషన్ చుట్టూ పచ్చదనంతో ఉండేలా చెట్లు, మొక్కలను నాటారు. అలాగే రైల్వే స్టేషన్‌లోనూ ఎకో ఫ్రెండ్లీ వెదర్‌ను కల్పిస్తూ నూతన హంగులను అభివృద్ధి చేశారు. హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌కు అధికారులు చేసిన కృషికిగాను గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ 5 స్టార్ రేటింగ్‌ను అసోచామ్ అందించింది. పచ్చదనం, ప్లాస్టిక్ రహితం, పర్యావరణహితం, కాలేజీలు, యూనివర్సీటీలు, కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, ప్రాజెక్టులకు అసోచామ్ గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ రేటింగ్‌లను ఇస్తూ ఉంటుంది.

హబీబ్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌లో వాడే విద్యుత్‌ దాదాపు 70 శాతం సోలార్‌ ఎనర్జీ ద్వారా ఉత్పత్తి చేయబడుతోంది. అలాగే రైల్వే స్టేషన్‌తో పాటు పరిసరాల్లో వర్షం నీటిని సేకరించి వాటినే ఉపయోగిస్తున్నారు. రైల్వే స్టేషన్ నిర్మాణంలో తక్కువగా కలపను ఉపయోగించారు. వ్యర్థ జలాల నిర్వహణతో పాటు 100 శాతం వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేయడం జరుగుతోంది. రైల్వే స్టేషన్‌కు వేసిన రంగుల్లోనూ కెమికల్స్ తక్కువగా ఉండేలా జాగ్రత్త వహించారు. రైల్వే స్టేషన్‌ పూర్తిగా సీసీటీవీ పర్యవేక్షణలో ఉంటుంది. దాదాపు రైల్వే స్టేషన్‌లో 176 సీసీ కెమెరాల అమర్చారు. అలాగే దివ్యాంగులకు అనువుగా ఉండేలా ఎంట్రీ ర్యాపులను, లిప్ట్‌లను, టాయిలెట్లను రైల్వే శాఖ అధికారులు ఏర్పాటు చేశారు.

Next Story
Share it