అసోం రాష్ట్రంలోని గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి స్పాలు, పార్లర్‌లలో క్రాస్ జెండర్( పురుషులకు స్త్రీలు, స్త్రీలకు పురుషులు) మసాజ్‌ను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యునిసెక్స్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలలో జరుగుతున్న దుష్ప్రవర్తనలను రూపుమాపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌహతి మున్సిపల్ కమిషనర్ దేవాశిష్ శర్మ తెలిపారు. ప్రజా నైతికత, పౌర సమాజాన్ని నియంత్రించే చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు.
గౌహతి నగరంలో స్పాలు, సెలూన్లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయని.. వీటిలో దాదాపు 60 శాతం రిజిస్టర్ చేయకుండా చట్టవిరుద్దంగా నిర్వహిస్తున్నారన్నారు. పట్టణంలోని స్పాలు, బ్యూటీ పార్లర్లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు నెల రోజుల సమయం ఇచ్చామని నిబంధనలు ఉల్లగించిన వారి లైసెన్స్‌లు పునరుద్దరించే అవకాశం లేదని చెప్పారు. ఇక కొత్త నిబంధనల ప్రకారం.. పార్లర్‌లు స్పాలకు ప్రత్యేక గదులు ఉండకూడదు. వీటి తలుపులు పారదర్శకంగా ఉండాలి. వ్యతిరేక లింగానికి చెందిన వారు మసాజ్ సేవలు చేయకూడదు.