10వ తరగతిలో 99% మార్కులు సాధించిన బాలిక.. బ్రెయిన్ హెమరేజ్‌తో మృతి

బోర్డు పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన గుజరాత్‌లోని మోర్బీకి చెందిన 16 ఏళ్ల బాలిక బుధవారం బ్రెయిన్‌ హెమరేజ్‌తో మరణించింది.

By అంజి
Published on : 16 May 2024 9:15 PM IST

Gujarat teen,  brain hemorrhage

10వ తరగతిలో 99% మార్కులు సాధించిన బాలిక.. బ్రెయిన్ హెమరేజ్‌తో మృతి

బోర్డు పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన గుజరాత్‌లోని మోర్బీకి చెందిన 16 ఏళ్ల బాలిక బుధవారం బ్రెయిన్‌ హెమరేజ్‌తో మరణించింది. గుజరాత్ సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (GSEB) ఫలితాలు మే 11న ప్రకటించబడ్డాయి. హీర్ ఘెటియా అనే బాలిక 10వ తరగతి పరీక్షల్లో 99.70 శాతం స్కోర్ చేసింది. బ్రెయిన్‌ హెమరేజ్‌తో బాధపడిన ఆమెకు నెల రోజుల క్రితం రాజ్‌కోట్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేశారు. ఆమె డిశ్చార్జ్ అయ్యి, ఆపరేషన్ తర్వాత ఇంటికి వెళ్ళింది, కానీ ఆమెకు ఒక వారం క్రితం శ్వాస, గుండె సమస్యలు మళ్లీ మొదలయ్యాయి.

ఆమెను ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్చారు. ఎంఆర్‌ఐ నివేదికలో ఆమె మెదడులో 80 నుండి 90 శాతం పని చేయడం ఆగిపోయిందని తేలింది. ఆమె గుండె పనిచేయడం ఆగిపోవడంతో హీర్ బుధవారం మరణించింది. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమె కళ్ళు, ఆమె శరీరాన్ని దానం చేశారు. "హీర్ డాక్టర్ కావాలనుకుంది. మేము ఆమె శరీరాన్ని దానం చేసాము. తద్వారా ఆమె డాక్టర్ కాలేకపోయినా, ఆమె ఇతర జీవితాలను రక్షించడంలో సహాయం చేయగలదు" అని ఆమె తండ్రి చెప్పారు.

Next Story