Gujarat: అరేబియా సముద్రంలో కూలిన రెస్క్యూ కోసం వెళ్లిన హెలికాఫ్టర్‌

ఒక హెలికాఫ్టర్ అరేబియా సముద్రంలో రెస్క్యూ కోసం వెళ్లి కుప్పకూలింది

By Srikanth Gundamalla  Published on  3 Sept 2024 12:30 PM IST
Gujarat: అరేబియా సముద్రంలో కూలిన రెస్క్యూ కోసం వెళ్లిన హెలికాఫ్టర్‌

గుజరాత్‌లో వరదల్లో ఇరుక్కున్న బాధితులను కాపాడేందుకు నేవీ అధికారులు హెలికాప్టర్ల ద్వారా సాయం అందించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా అందులోని ఒక హెలికాఫ్టర్ అరేబియా సముద్రంలో రెస్క్యూ కోసం వెళ్లి కుప్పకూలింది. పోరుబందర్‌ తీరం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన తర్వాత సముద్రంలో ముగ్గురు సిబ్బంది గల్లంతు అయ్యారి. ప్రస్తుతానికి ఒకరి మృతదేహం లభ్యమైందని అధికారులు చెప్పారు.

కాగా.. మోటార్ ట్యాంక‌ర్ హ‌రి లీలా నౌక వ‌ద్ద‌కు రెస్క్యూ చేసేందుకు ఆ హెలికాప్ట‌ర్ వెళ్లింది. 45 కిలోమీటర్ల దూరంలో మోటార్‌ ట్యాంక హరిలీలాలో గాయపడిన సిబ్బందిని రక్షించడానికి సెప్టెంబర్‌ 2 రాత్రి 11 గంటలకు అధునాతన తేలికపాటి హెలికాప్టర్‌ను మోహరించినట్లు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్‌ సందర్భంగా హెలికాప్టర్‌లో సమస్య తలెత్తి ఉంటుందని అనుమానిస్తున్నారు. దాంతో.. సముద్రంపై అత్యవసర హార్డ్‌ ల్యాండింగ్‌ చేయవలసి వచ్చిందంటున్నారు. హెలికాప్టర్‌లో ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు సిబ్బంది ఉండగా.. అప్రమత్తం అయిన కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఒకరిని కాపాడారు. ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.

కాగా.. సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్‌నే ఇటీవల గుజరాత్‌లో వరదల్లో ఇరుక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వినియోగించారు. దాదాపు 67 మందిని రక్షించారు. ఆ హెలికాప్టరే కుప్పకులడం విషాదాన్ని నింపుతోంది. హెలికాప్టర్‌ కూలిన సంఘటనలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగు నౌకలు, రెండు విమానాల ద్వారా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Next Story