చాందిపురా వైరస్ కలవరం.. గుజరాత్‌లో 16 మంది మృతి

భారత్‌లో చాందిపురా వైరస్ కలవరం సృష్టిస్తోంది.

By Srikanth Gundamalla  Published on  21 July 2024 7:45 AM GMT
gujarat, chandipura virus, 16 deaths,

 చాందిపురా వైరస్ కలవరం.. గుజరాత్‌లో 16 మంది మృతి

భారత్‌లో చాందిపురా వైరస్ కలవరం సృష్టిస్తోంది. ఈ వ్యాధి సోకిన వారిలో ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్, మధ్యప్రదేశ, రాజస్థాన్‌లో ఈ చాందిపురా వైరస్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరణాలు ఎక్కువ అవుతుండంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క గుజరాత్‌లోనే 16 మరణాలు నమోదు అయ్యాయి. గుజరాత్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్‌ ప్రభావం కనబడుతోంది. అయితే.. వైరస్ ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.

గుజరాత్‌లో చాందీపుర వైరస్ కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారని.. మరో 50 కేసులు నమోదయ్యాయని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి హృషికేష్ పటేల్ చెప్పారు. వ్యాధి నియంత్రణ కోసం తాము అప్రమత్తం అయ్యాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే చర్యలను ప్రారంభించామన్నారు. చాందిపురా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మలాథియాన్ పౌడర్‌ను పిచికారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వైరస్‌ లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోగులకు ఎలాంటి జ్వరం వచ్చినా వెంటనే ఇంటెన్సివ్‌ ట్రీట్‌మెంట్‌ అందించాలని సూచించారు.

మరోవైపు రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఆరోగ్య టెస్టులు టెస్టులు జరుగుతున్నాయి. గుజరాత్‌లోని 17248 ఇళ్లలోని 1.22 లక్షల మందిని వైద్య బృందాలు పరీక్షించాయి. ఈ క్రమంలోనే ఈ కేసులు వెలుగు చూశాయని చెబుతున్నారు. వైరస్ బారిన పడ్డ వారికి తగిన కాలంలో చికిత్స అందించాలనీ. లేదంటే ప్రాణానికి ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Next Story