Gujarat: లోయలో పడిన 70 మందితో వెళ్తున్న బస్సు

గుజరాత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది.

By Srikanth Gundamalla  Published on  8 July 2024 7:45 AM IST
Gujarat, bus, valley, two children dead,

Gujarat: లోయలో పడిన 70 మందితో వెళ్తున్న బస్సు 

గుజరాత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి

గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సపుతారాలో ఈ ప్రమాదం సంభవించింది. ఆదివారం సూరత్ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు సపుతర ఘాట్‌ వద్దకు రాగానే.. మరో వెహికల్‌ను ఓవర్‌ టేక్‌ చేయబోయి అదుపుతప్పింది. దాంతో.. లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. అయితే.. బస్సు లోయలో పడటంతో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న సపుతర పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. 108 బృందం కూడా అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

బస్సు ఆదివారం సూరత్‌ చౌక్‌ మార్కెట్‌ నుంచి సపుతరకు పర్యాటకులతో బయల్దేరి..తిరిగి సూరత్‌ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఓ వాహనాన్ని ఓవర్‌ టెక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న టెంపోను తప్పించే క్రమంలో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో అక్కడే ఉన్న గోడను ఢీకొని లోయలో పడింది. రోడ్డుప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోవడం విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Next Story