గుడ్‌న్యూస్‌.. శబరిమల యాత్రికులకు బీమా!

శబరిమల ఆలయాన్ని సందర్శించే భక్తులకు బీమా కవరేజీని ప్రారంభించాలన్న ట్రావెన్‌కోర్ట్‌ దేవస్థానం బోర్డు ప్రణాళికకు బీమా సంస్థల నుంచి సానుకూల స్పందన లభించింది.

By అంజి  Published on  8 July 2024 9:13 AM GMT
Insurance, Sabarimala pilgrims, Kerala

గుడ్‌న్యూస్‌.. శబరిమల యాత్రికులకు బీమా!

శబరిమల ఆలయాన్ని సందర్శించే భక్తులకు బీమా కవరేజీని ప్రారంభించాలన్న ట్రావెన్‌కోర్ట్‌ దేవస్థానం బోర్డు ప్రణాళికకు బీమా సంస్థల నుంచి సానుకూల స్పందన లభించింది. ఇటీవల కొన్ని బీమా కంపెనీలతో జరిగిన సమావేశాలు మార్కెట్‌పై విలువైన అవగాహన కల్పించాయని టీడీబీ అధ్యక్షుడు పీఎస్‌ ప్రశాంత్‌ తెలిపారు. పోటీ, నిష్పాక్షిక ప్రక్రియ ద్వారా బీమా ప్రొవైడర్‌ను ఎంపిక చేస్తామని, ఇందులో భాగంగా కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానించనున్నట్టు ప్రశాంత్‌ పేర్కొన్నారు. తక్కువ ప్రీమియంతో గరిష్ట ప్రయోజనాలు అందించే సంస్థను ఎంపిక చేస్తామని తెలిపారు.

యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ సంస్థ భాగస్వామ్యంతో గత యాత్రికులకు బీమా కవరేజీని అందించేవారు. పరిమిత ప్రయోజనాలు అందించే పథకానికి బోర్డు వార్షిక ప్రీమియం చెల్లించేది. దీని ద్వారా శబరిమల కొండపై ప్రమాదవశాత్తు మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించేవారు. దీని వల్ల కలిగే గరిష్ఠ ప్రయోజనాలను చూసుకుంటే.. శబరిమల భక్తులు వర్చువల్‌ క్యూ విధానం ద్వారా బుక్‌ చేసేటప్పుడు రూ.10 వరకు వన్‌ టైమ్‌ ప్రీమియం కవరేజీని ఎంచుకునే కొత్త బీమా పథకాన్ని ట్రావెన్‌ కోర్ దేవస్థానం బోర్డు ప్రవేశపెట్టబోతోంది. ఈ కొత్త పథకం కింద సుమారు రూ.5 లక్షల బీమా సౌకర్యంతో పాటు మెరుగైన ప్రయోజనాలు కల్పించాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story