గూగుల్ వినియోగదారులకు శుభవార్త..!
Good news for google users.ఏదైనా మనకు తెలియని విషయం గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా గూగుల్ సర్చ్ చేయడం అలవాటుగా మారిపోయింది.తమ వినియోగదారులకు సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది.
By తోట వంశీ కుమార్ Published on 19 Jan 2021 11:52 AM ISTఏదైనా మనకు తెలియని విషయం గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా గూగుల్ సర్చ్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఈ విధంగా గూగుల్ ఎంతోమంది కస్టమర్లకు దగ్గర అయిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్ తో యూజర్లకు అందుబాటులో ఉన్న గూగుల్ తాజాగా మరొక శుభవార్తను తెలియజేసింది. గూగుల్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. అయితే గూగుల్ ద్వారా అందుబాటులోకి రానున్న ఫ్యూచర్ వల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఈ ఫీచర్ వల్ల యూజర్లకు ఎలాంటి ప్రయోజనం అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం...
గూగుల్ సంస్థ ఈ ఏడాదిలో తమ వినియోగదారులకు సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్ షార్ట్ వీడియోలను గూగుల్ సెర్చ్ లో తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో కనిపించే వెబ్సైట్ ల పైన షార్ట్ వీడియోలు కనిపించే విధంగా తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగ దశలో ఉంది. అయితే తొందరలోనే ఈ ఫీచర్ గూగుల్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని గూగుల్ సంస్థ పేర్కొంది.
ఈ సందర్భంగా గూగుల్ కంపెనీ చిన్న వీడియోలను చూపించడం ఇదే తొలిసారి. అయితే ప్రస్తుతం గూగుల్ తీసుకు వస్తున్న ఈ షార్ట్ వీడియో ఫీచర్ గతంలో తీసుకువచ్చిన గూగుల్ స్టోరేజ్ కు ఏ మాత్రం సంబంధం లేదు. ఇప్పటివరకు యూట్యూబ్, టంగి వంటి షార్ట్ వీడియోలను, ట్రైలర్లను మాత్రమే తీసుకునేవారు. తాజాగా వచ్చిన ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్ వీడియోలు కనిపించేలా గూగుల్ సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇలాంటి వీడియోలను క్లిక్ చేస్తే వెబ్ వెర్షన్ లో మాత్రమే ఓపెన్ అవుతాయి. దానివల్ల యూజర్ యాప్ ఓపెన్ చేయాల్సిన పని ఉండదట. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ఎంతోమంది యూజర్లకు సులువైన మార్గం అందించే పనిలో గూగుల్ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఉంటుందని గూగుల్ సంస్థ పేర్కొంది.