గోవా ఆస్ప‌త్రిలో ఆగ‌ని మ‌ర‌ణాలు.. 4 రోజుల్లో 74 మంది మృతి

Goa's oxygen crisis claims 74 lives in four days.గోవాలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. మొత్తం నాలుగు రోజుల్లో 74 మంది ప్రాణాలు కోల్పోయారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2021 1:17 PM IST
goa corona update

గోవాలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. అక్క‌డ స‌గ‌టున రెండు ప‌రీక్ష‌ల్లో ఒక‌టి పాజిటివ్‌గా వ‌స్తోంది. ఇదిలా ఉంటే.. ఆక్సిజ‌న్ అంద‌క రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘ‌టన‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. శుక్ర‌వారం కూడా గోవా వైద్య క‌ళాశాల ఆస్ప‌త్రి(జీఎంసీహెచ్‌)లో మ‌రో 13 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు రాష్ట్ర అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ బాంబే హెకోర్టులోని గోవా బెంచ్‌కు వెల్ల‌డించారు. కేవ‌లం నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో ఈ ఆస్ప‌త్రిలో 70 మందికి పైగా మృతిచెందారు.

ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా అందుబాటులో లేక‌పోవ‌డంతోనే ఈ మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టుకు తెలిపింది. మంగ‌ళ‌వారం ఇదే ఆస్ప‌త్రిలో 26 మంది, బుధ‌వారం 20 మంది, గురువారం తెల్ల‌వారుజామున 15 మంది, ఈ రోజు ఉద‌యం 13 మందితో క‌లిపి.. మొత్తం నాలుగు రోజుల్లో 74 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల ర‌వాణాలో ఎదురైన కొన్ని స‌మ‌స్య‌ల కార‌ణంగానే ఈ ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం చెబుతోంది. ఆక్సిజ‌న్ కొర‌త‌తో చోటు చేసుకుంటున్న మ‌ర‌ణాల‌పై ఇప్ప‌టికే ప‌లు ఫిర్యాదులు దాఖ‌ల‌య్యాయి. వీటిపై హైకోర్టు విచార‌ణ జ‌రుపుతోంది. కోర్టులో విచార‌ణ జ‌రుగుతుండ‌గానే.. జీఎంసీహెచ్‌లో ఆస్ప‌త్రికి ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం శుక్ర‌వారం ఓ క‌మిటీ ఏర్పాటు చేసింది.




Next Story