ప్రధాన క్విక్-కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల గిగ్ వర్కర్లు ఈ నెల 31న దేశ వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్నారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ప్లిఫ్‌కార్ట్ యాప్స్ డెలివరీ బాయ్స్ సర్వీసులు ఆపేయనున్నారు. తమ డిమాండ్‌లు నెరవేర్చాలంటూ సమ్మెకు రెడీ అవుతున్నారు. పారదర్శక, న్యాయమైన వేతన చెల్లింపులు, 10 నిమిషాల డెలివరీ మోడల్‌ను విత్ డ్రా చేసుకోవాలని, సరైన ప్రాసెస్ లేకుండా అకౌంట్‌ను బ్లాక్ చేయడం ఆపేయాలని, మెరుగైన ప్రమాద బీమా కల్పించాలని, హామీ ఇచ్చిన మేరకు పని కేటాయించాలని డెలివరీ బాయ్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఫలితంగా, నూతన సంవత్సర పండుగ సందర్భంగా ఆహారం, కిరాణా మరియు ఇ-కామర్స్ డెలివరీలు పెద్ద అంతరాయాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. పడిపోతున్న ఆదాయం, అధిక పని గంటలు, సెక్యూరిటీ లేని స్పీడీ డెలివరీ లక్ష్యాలకు వ్యతిరేకంగా డెలివరీ బాయ్స్ సమ్మెకు సిద్ధమవుతున్నారు. వర్క్ ప్లేస్‌లో సోషల్ సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మెట్రో సిటీలతో పాటు టైర్ 2 పట్టణాల్లో ఈ ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఆల్టర్నేటివ్స్ చూసుకోవాల్సి రావొచ్చు.