Video: 'నాటు నాటు' పాటకు జర్మనీ రాయబారి స్టెప్పులు.. గూస్‌బంప్స్‌ రావడం పక్కా.!

భారత్‌లోని జర్మనీ రాయబారి ఫిలిప్‌ ఆకర్మన్‌.. 'ఆర్‌ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటకు స్టెప్పులేశారు.

By అంజి  Published on  20 March 2023 1:48 AM GMT
German Ambassador, German Embassy, Naatu Naatu

'నాటు నాటు' పాటకు జర్మనీ రాయబారి స్టెప్పులు

భారత్‌లోని జర్మనీ రాయబారి ఫిలిప్‌ ఆకర్మన్‌.. 'ఆర్‌ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటకు స్టెప్పులేశారు. శనివారం నాడు ఓల్డ్‌ ఢిల్లీలోని తన ఎంబసీ కార్యాలయ సిబ్బందితో కలిసి ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు వేశారు. ఆ స్టెప్పుల వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ''జర్మన్లు డ్యాన్స్ చేయలేరా? నేను, నా ఇండో – జర్మన్ టీమ్.. ఆస్కార్‌లో 'నాటు నాటు' పాట విజయాన్ని ఢిల్లీలో వేడుకగా జరుపుకున్నాం. సరే, పెర్ఫెక్ట్‌గా లేదు. కానీ ఫన్ ఉంది'' అని ఆకర్మనక్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. వీడియోలో ఫిలిప్ ఆకర్మన్.. ఆటో రిక్షా నుంచి దిగడం, 'నాటు నాటు' పాట మొదలవటం కనిపిస్తుంది. ఆ పాట వినగానే ఆయన, ఆయన బృందం రోడ్డు మీద డ్యాన్స్‌ చేస్తూ కనిపిస్తారు.

ఇకక భారత సినీ ఇండస్ట్రీ ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన 'ఆస్కార్‌' అవార్డును 'ఆర్‌ఆర్‌ఆర్‌' నిజం చేసింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌ ఆస్కార్‌ వేదికపై అవార్డు అందుకున్నారు. ఆస్కార్‌ అవార్డును అందుకున్న తర్వాత 'ఆర్ఆర్ఆర్‌' టీమ్‌తో పాటు యావత్ భారతదేశం ఉప్పొంగిపోతూనే ఉంది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్‌టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'. గతేడాది విడుదలైన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడమే కాకుండా వసూళ్ల వర్షం కురిపించింది. రూ.1000కోట్లకు పైగా వసూళ్లను రాబ్టటింది.

Next Story