ఎల్లుండి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌.. ఏం కొనుక్కోవాల‌న్న రెండు రోజులే అవ‌కాశం

From Monday Complete lockdown in tamil nadu.రాష్ట్రంలో సోమవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌ డౌన్ ను మే 31 వ‌రకూ పొడిగించిన‌ట్టు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 May 2021 7:16 AM IST
tamilnadu lockdown

క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండ‌డంతో ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ ల‌ బాట ప‌ట్ట‌గా మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్నాయి. దీంతో గ‌త కొద్ది రోజులుగా కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఇక త‌మిళ‌నాడు రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. ఈ పాక్షిక లాక్‌డౌన్‌తో పెద్ద‌గా ప్రయోజ‌నం క‌నిపించ‌డం లేదు. ఒక‌ప్పుడు అత్య‌ధిక పాజిటివ్ కేసులు మ‌హారాష్ట్ర‌లో వ‌స్తుండ‌గా.. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో ఆ ప‌రిస్థితి ఉంది. దీంతో త‌మిళ‌నాడులో కొత్త‌గా ఏర్ప‌డిన స్టాలిన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

రాష్ట్రంలో సోమవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌ డౌన్ ను మే 31 వ‌రకూ పొడిగించిన‌ట్టు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. ఏం చేసినా.. ఏం కొనుక్కోవాలన్నా ఇవాళ, రేపు మాత్రమే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నీ మూతపడతాయి. అత్యవసర సర్వీసులు, మెడికల్ షాపులు, ఆస్పత్రులు, మీడియాకు మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుత లాక్ డౌన్ మరో 2 రోజుల్లో ముగియనుండడంతో సీఎం స్టాలిన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

క‌రోనా పరిస్థితులపై చర్చించారు. వైద్య, ఆరోగ్య నిపుణులు రెండు వారాలు కఠిన లాక్ డౌన్ విధించాలని సూచించారు. ఎలాంటి మినహాయింపులు లేకుండా పకడ్బందీగా లాక్ డౌన్ విధించాలని, అప్పుడే కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. దీంతో రాష్ట్రంలో మరో వారం పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.


Next Story