రాజ్య‌స‌భ‌కు ఇళ‌య‌రాజా, విజేంద్ర‌ప్ర‌సాద్‌, పి.టి.ఉష‌, వీరేంద్ర హెగ్గ‌డే

Four noted personalities from southern states Modi govt’s Rajya Sabha picks.ద‌క్షిణాది నుంచి న‌లుగురు ప్ర‌ముఖుల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 July 2022 8:58 AM IST
రాజ్య‌స‌భ‌కు ఇళ‌య‌రాజా, విజేంద్ర‌ప్ర‌సాద్‌, పి.టి.ఉష‌, వీరేంద్ర హెగ్గ‌డే

ద‌క్షిణాది నుంచి న‌లుగురు ప్ర‌ముఖుల‌ను రాష్ట్ర‌ప‌తి కోటాలో రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ జాబితాలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తండ్రి, సినీ క‌థా ర‌చ‌యిత వి.విజయేంద్ర ప్రసాద్, సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా, ప‌రుగుల రాణి పి.టి ఉష‌, ఆధ్యాత్మిక‌వేత్త వీరేంద్ర హెగ్గ‌డే లు ఉన్నారు. ఈ న‌లుగురు త‌మ త‌మ రంగాల్లో ద‌శాబ్దాలుగా విశేష సేవ చేస్తున్నార‌ని కేంద్రం తెలిపింది. అందుకు గుర్తింపుగానే వారిని రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసిన‌ట్లు పేర్కొంది.

ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌లు..

రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయిన ఇళ‌య‌రాజా, విజేంద్ర‌ప్ర‌సాద్‌, పి.టి ఉష‌, వీరేంద్ర హెగ్గ‌డేల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభినందించారు. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి సృజ‌నాత్మ‌క ప్ర‌పంచంతో మ‌మేకమై వి.విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఉన్నారు. ఆయ‌న వ‌ల్ల అద్భుత‌మైన భార‌తీయ సంస్కృతి ప్ర‌పంచ‌స్థాయి గుర్తింపు పొందింది. రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయిన సంద‌ర్భంగా అభినంద‌న‌లు అని ప్ర‌ధాని అన్నారు.

త‌న సంగీత మేధ‌స్సుతో ఇళ‌య‌రాజా త‌ర‌త‌రాల‌ను ఆనంద డోలిక‌ల్లో ముంచేస్తున్నారు. ఆయ‌న ప‌ని ఎన్నో భావోద్వేగాల‌ను ప్ర‌తిబింబించింది. ఆయ‌న అట్ట‌డుగు స్థాయి నుంచి అత్యున్న‌త స్థానానికి ఎదిగి ఎంద‌రికో స్పూర్తిగా నిలిచారు అని మోదీ వ్యాఖ్యానించారు.

క్రీడా రంగంలో పి.టి. ఉష చూపిన ప్ర‌తిభాపాట‌వాలు జ‌గ‌ద్విదిత‌మ‌ని మోదీ అన్నారు.


విద్య‌, వైద్యం సంస్కృతుల అభ్యున్న‌తికి వీరేంద్ర హెగ్గ‌డే గొప్ప కృషి చేస్తున్నార‌ని కీర్తించారు.

Next Story