దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయ్యారు. మంగళవారం తెల్లవారుజామూన ఓల్డ్ సీమాపురి ప్రాంతంలోని మూడు అంతస్తుల భవనంలోని మూడో అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరుకు గల్లీలో ప్రమాదం జరగడంతో ఫైరింజన్లు రావడానికి కొంత కష్టంగా మారింది. ఎంతో శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా.. అప్పటికే నలుగురు సజీవదహనం అయ్యారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గ్యాస్ లీకేజీ కారణంగా ప్రమాదం జరిగిందా..? మరి ఇంకేదైనా కారణంగా ప్రమాదం జరిగిందా..? అని తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఇరుకుగల్లీలో ప్రమాదం జరగడంతో అక్కడి స్థానికులు తీవ్రభయాందోళన చెందారు.