మాజీ ప్ర‌ధాని దేవెగౌడ దంప‌తుల‌కు క‌రోనా పాజిటివ్‌..

Deve Gowda couple test positive.భార‌త మాజీ ప్ర‌ధాని హెచ్‌డీ దేవెగౌడ దంప‌త‌లు క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2021 10:09 AM GMT
Deve Gawunda tests corona postive

భార‌త మాజీ ప్ర‌ధాని హెచ్‌డీ దేవెగౌడ దంప‌తులు క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. దేవెగౌడ‌తో పాటు ఆయ‌న భార్య చెన్న‌మ్మ‌కు సైతం క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.

'నాకు, నా భార్య చెన్నెమ్మ‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. దీంతో మాతో పాటు మా కుటుంబం అంతా సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్నాం. గ‌త కొద్ది రోజులుగా న‌న్ను క‌లిసిన అంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా. జేడీఎస్ కార్య‌క‌ర్త‌లు, శ్రేయాభిలాషులు ఎలాంటి దిగులు చెంద‌వ‌ద్ద‌ని కోరుతున్న‌ట్లు ' ట్వీట్ చేశారు.

దేవెగౌడ‌కు క‌రోనా పాజిటివ్ అని స‌మాచారం అందుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వెంట‌నే ఆయ‌న‌కు ఫోన్ చేసి దంప‌తుల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు ట్వీట్ చేశారు.

కరోనా నుంచి త్వరగా కోలుకుని, యథావిధిగా వారి పనికి తిరిగి వస్తారని తాను ఆశిస్తున్నానని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప ట్విట్‌ చేశారు.

ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 10,22,915 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 53,480 కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన కేసుల సంఖ్య 1,21,49,335కి చేరింది. నిన్న కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా 354 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,62,468కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 41,280 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్నా వారి సంఖ్య 1,14,34,301కి చేరింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 5,52,566 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,36,72,940 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం దేశ వ్యాప్తంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 6,30,54,353 మందికి వ్యాక్సిన్లు వేశారు.


Next Story
Share it