విదేశీ టీకా.. చౌక గా దొరికేనా?

Foreign covid vaccine Can it be found cheap?.కరోనా విస్తరిస్తున్నంత వేగంగా టీకా విస్తరించదు..ఇక దేశీయంగా అందుబాటులోకి వచ్చిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 April 2021 8:42 AM IST
Foreign vaccine

కరోనా విస్తరిస్తున్నంత వేగంగా టీకా విస్తరించదు..ఇక దేశీయంగా అందుబాటులోకి వచ్చిన రెండు టీకాలు మన అవసరాలను తీర్చలేకపోతున్నాయి. దీంతో విదేశాల నుంచి టీకాల్ని తక్కువ ధరకే దిగుమతి చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పలు విదేశీ టీకా సంస్థలు భారత్‌లో దరఖాస్తు చేసుకున్నాయి. కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిమిత్తం స్పుత్నిక్‌ వి టీకాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి కంపెనీలు కూడా మనదేశంలో అత్యవసర వినియోగ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి.

వాటికీ అనుమతులు వస్తే ఆయా టీకాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. వాటిపై సుంకాల భారం మోపితే ధరలు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం కస్టమ్స్‌ సుంకం రద్దు దిశగా యోచిస్తోంది. అయితే, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. విదేశీ టీకాలపై 10 శాతం దిగుమతి సుంకం వర్తిస్తుంది. ఐజీఎస్టీ, సర్‌ ఛార్జీలు కలుపుకొని టీకా ఖరీదు భారీగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో టీకాల్ని భారత్‌లో తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు కనీసం ఈ 10 శాతం దిగుమతి సుంకాన్ని అయినా రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే ప్రైవేటు సంస్థలు టీకాల్ని విదేశాల నుంచి కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించాలని కూడా కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.




Next Story