ముంబైలో కుప్ప‌కూలిన ఫ్లైఓవ‌ర్‌.. 14 మందికి గాయాలు

Flyover collapses in Bandra Kurla Complex.నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవ‌ర్ కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో 14 మంది గాయ‌ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Sep 2021 2:40 AM GMT
ముంబైలో కుప్ప‌కూలిన ఫ్లైఓవ‌ర్‌.. 14 మందికి గాయాలు

నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవ‌ర్ కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో 14 మంది గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు అక్క‌డ‌కు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై న‌గ‌రంలోని బాంద్రా కుర్లా కాంపెక్స్ వ‌ద్ద జ‌రిగింది.

శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 4.40 గంట‌ల స‌మ‌యంలో బాంద్రా కుర్లా కాంప్లెక్సు వ‌ద్ద నిర్మాణంలో ఉన్న ప్లై ఓవ‌ర్ ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టారు. ఈ ప్ర‌మాదంలో 14 మంది కార్మికులు గాయ‌ప‌డ్డారు. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవ‌రైనా చిక్కుకున్నారేమో అన్న అనుమానంతో స‌హాయ‌క చ‌ర్య‌లు ఇంకా కొన‌సాగిస్తున్నారు. కాగా.. గాయ‌ప‌డిన వారిలో ముగ్గురు ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. నాణ్యత లోపం వల్లనే ఫ్లై ఓవర్ కూలింద‌ని ప‌లువురు అంటున్నారు. కాగా.. దీనిపై ఇంకా అధికారిక స‌మాచారం వెలువ‌డాల్సి ఉంది.

Next Story
Share it