విషాదం.. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రైతు ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla
Published on : 2 July 2024 9:30 AM IST

five people, suicide,  madhya Pradesh, same family,

విషాదం.. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రైతు ఆత్మహత్య 

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఇంట్లో ఓ రైతు తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో స్థానికంగా ఈ గటన విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వీరిది ఆత్మహత్య అని ప్రాథమికంగా నిర్ధారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవ్డి గ్రామంలో రాకేష్ దోడ్వా రైతుగా ఉన్నాడు. గతంలో ఇతను గుజరాత్‌లో తాపీ మేస్త్రీగా కూడా పనిచేసేవాడు. రాకేష్ దోడ్వా (27), అతని భార్య లలితా దోడ్వా (25). వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. కుమారులు ప్రకాష్ (7), అక్షయ్ (5), కుమార్తె లక్ష్మి (9). ఆదివారం రాత్రి రాకేష్‌ తన భార్య, ఇద్దరు కుమారులు ఉరివేసుకుని చనిపోయారు. చిన్నారి మాత్రం నేలపై పడిపోయి ఉంది. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు ఎంతకీ బటయకు రాకపోవడంతో.. స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూశారు. దాంతో.. ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. ఐదుగురు చనిపోయారనే విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఉదయం 9.30 గంటలకు తమకు ఈ విషయం తెలిసిందని పోలీసులు తెలిపారు.

సంఘటనాస్థలిలో తమకు ఎలాంటి సూసైడ్ నోట్‌ లభించలేదని పోలీసులు తెలిపారు. దీనిపై అలీరాజ్‌పూర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (ఎస్‌డిఓపి) నేతృత్వంలోని బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు తెలిపారు. ప్రాథమికంగా చూస్తే ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

మరోవైపు డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. ఇండోర్ నుండి ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంటోందని, మృతదేహాల పోస్టుమార్టం వీడియో తీయబడిందని పోలీసులు తెలిపారు.

Next Story