రొమేనియా నుంచి 219 మంది భారతీయులతో బయలేర్దిన విమానం
First flight carrying 219 Indians takes off from Romania.ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర యుద్దం కొనసాగుతోంది. రష్యా
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2022 4:44 PM ISTఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర యుద్దం కొనసాగుతోంది. రష్యా సేనల దాడులతో ఉక్రెయిన్‌లోని ప్రజలు ప్రాణాలు అరచేతుత్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. స్థానిక ప్రజలు అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటుండగా.. అక్కడి వెళ్లిన విదేశీయులు ఆయా దేశాల సహకారంతో అక్కడి నుంచి బయటపడేందుకు యత్నిస్తున్నారు. ఇక ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను సమీపంలో ఉన్న సరిహద్దు దేశాలకు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి తీసుకువస్తున్నారు.
ఈ క్రమంలో రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా విమానం బుకారెస్ట్ నుంచి ముంబైకి బయలుదేరింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు. అందరిని సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు అహర్నిశలు పనిచేస్తున్నట్లు తెలిపారు. తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. భారతీయుల తరలింపులో మంచి సహకారం అందించిన రొమేనియా విదేశాంగశాఖ మంత్రి బోగ్డాన్ అరెస్కూకు కృతజ్ఞతలు తెలియజేశారు.
My heartfelt thanks to FM @BogdanAurescu for his Government's cooperation. https://t.co/L0EknlIrHT
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 26, 2022
కాగా.. రుమేనియా నుంచి బయలుదేరిన విమానం రాత్రి 8 గంటలకు ముంబై చేరుకోవచ్చు. ఇక ఆదివారం (ఫిబ్రవరి 27) తెల్లవారుజామున 2:30 గంటలకు మరో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకోనుంది. ఒక్కో విమానంలో 200 నుంచి 240 మంది విద్యార్థులను తరలిస్తున్నారు.