పార్ల‌మెంట్ భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం

Fire breaks out in a room inside Parliament House.దేశ రాజ‌ధాని ఢిల్లీలోని పార్ల‌మెంట్ భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Dec 2021 11:32 AM IST
పార్ల‌మెంట్ భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని పార్ల‌మెంట్ భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ రోజు(బుధ‌వారం) ఉద‌యం 8 గంట‌ల ప్రాంతంలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పార్ల‌మెంట్‌లోని 59వ గదిలో మంట‌లు చెల‌రేగాయ‌ని తెలిపారు. పార్ల‌మెంట్ వెలుప‌ల ఉన్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చార‌న్నారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియరాలేద‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో కొన్ని టేబుళ్లు, కంప్యూట‌ర్లు కాలిపోయిన‌ట్లు తెలుస్తోంది. కాగా.. న‌వంబ‌ర్ 29 నుంచి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈస‌మావేశాలు డిసెంబ‌ర్ 23 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.


ఇదిలా ఉంటే.. రాజ్య‌స‌భ వ‌రుస‌గా మూడో రోజు కూడా విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకింది. టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర స‌మితి) ఎంపీల‌తో పాటు ఇత‌ర పార్టీల ఎంపీలు కూడా ధాన్యం సేక‌ర‌ణ‌, పంట‌ల‌కు క‌నీస మ‌ద్దతు ధ‌ర‌, ఆందోళ‌నల్లో మ‌ర‌ణించిన రైతుల‌కు ప‌రిహారం విష‌య‌మై స‌భ‌లో నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ఛైర్మ‌న్ పోడియాన్ని చుట్టుముట్టారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం స‌మ‌గ్ర విధానం తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. విప‌క్షాల ఆందోళ‌న‌ల‌తో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో ఛైర్మ‌న్ రాజ్య‌స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.


Next Story