ఈ వీడియో చూస్తే.. ఇక జ‌న్మ‌లో కొత్తిమీర తిన‌రు

FIR against Bhopal vendor for washing coriander leaves in drain water.ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం అన్నారు పెద్ద‌లు. అలాంటి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2021 5:01 PM IST
ఈ వీడియో చూస్తే.. ఇక జ‌న్మ‌లో కొత్తిమీర తిన‌రు

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం అన్నారు పెద్ద‌లు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం కోసం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే ఉంటాం. అయితే.. మ‌నం ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నటి కూడా కొంద‌రి కార‌ణంగా అనారోగ్యం పాలుకాక త‌ప్ప‌దు. ఈ వీడియో చూస్తే.. మ‌రోసారి కూర‌గాయాలు కొనాలంటే ఒక‌టి ప‌ది సార్లు ఆలోచిస్తారు. ప్ర‌స్తుతం వంట‌ల్లో కొత్తిమీర వాడకం బాగా పెరిగింది. టేస్ట్ కోస‌మో.. ఆరోగ్యానికి మంచిద‌నో తెలీదు కానీ.. దాదాపు ప్ర‌తి వంట‌లోనూ కొత్తిమీర‌ను వినియోగిస్తున్నారు. అయితే.. ఓ కూర‌గాయల వ్యాపారి త‌న ద‌గ్గ‌ర ఉన్న కోతిమీరను డ్రైనేజీ వాట‌ర్‌తో క‌డిగి.. దాన్నే విక్ర‌యిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడాడు. అత‌డు చేసిన నిర్వాకం మొత్తాన్ని ఓ వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది. అధికారుల దృష్టికి వెళ్ల‌డంతో అత‌డిపై కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లో జ‌రిగింది. కొత్తిమీరను మురుగునీటిలో శుభ్రపరిచిన వీడియో కలెక్టర్ అవినాష్ లవనియాకు చేరగా.. దీనిపై ఆయ‌న తీవ్ర ఆహాగ్రం వ్య‌క్తం చేశారు. ఈ వీడియోను త‌న ట్విట‌ర్ ఖాతాలో షేర్ చేస్తూ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసు అధికారుల‌ను ఆదేశించారు. క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆ కూర‌గాయల వ్యాపారిని ధ‌ర్మేంద్ర గా గుర్తించారు. అత‌డికి ఫోన్ చేస్తే ప్ర‌స్తుతం స్విచ్చాఫ్ వ‌స్తోంది. ప్ర‌స్తుతం అత‌డిని ప‌ట్టుకునే ప‌నిలో ఉన్నారు పోలీసులు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్న ఇత‌డిని అంత తేలిక‌గా వ‌ద‌ల‌కూడ‌ద‌ని నెటిజ‌న్లు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story