కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నిర్మలా సీతారామన్, అరవింద్ కేజ్రీవాల్

Finance Minister Nirmala Sitharaman gets her first dose of covid 19 vaccine.భారతదేశంలో రెండో దశ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2021 10:38 AM GMT
Finance Minister Nirmala Sitharaman gets her first dose of covid 19 vaccine

భారతదేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 60 ఏళ్లుదాటినవారికి, 45 సంవత్సరాలు పైబడి, అనారోగ్యంతో ఉన్న వారికి ఈ దశలో వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సహా పలు కేంద్ర మంత్రులు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు టీకాను వేయించుకున్నారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఢిల్లీ వసంత కుంజ్ లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురువారం ఆమె కోవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోస్‌ను స్వీకరించారు. తనకు టీకా వేసిన నర్స్‌ రమ్యకు థ్యాంక్స్‌ చెప్పారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీ, సరైన సమయంలో, సరసమైన ధరలో టీకా లభిస్తున్న భారతదేశంలో పుట్టడం తన అదృష్టం అంటూ ట్వీట్‌ చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం కోవిడ్‌ వాక్సిన్‌ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ మొదటి మోతాదును స్వీకరించారు. ప్రజలందరూ ముందుకు వచ్చి టీకా తీసుకోవాలని ఆయన కోరారు. ఢిల్లీ సీఎంతో పాటు, ఆయన తల్లి దండ్రులు కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

భారతదేశంలో గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. అదే స‌మ‌యంలో 14,031 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 89 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,435కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,26,075 మంది కోలుకున్నారు. 1,73,413 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.


Next Story
Share it